భూభారతి దరఖాస్తులు పెండింగ్‌ ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

భూభారతి దరఖాస్తులు పెండింగ్‌ ఉండొద్దు

Aug 19 2026 1:06 AM | Updated on Aug 19 2026 1:06 AM

కొడిమ్యాల: భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. భూభారతికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు, సాదాబైనామా, మీసేవ ఫైళ్లను పరిశీలించి పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ నరేష్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయానికి స్థలం పరిశీలన

జగిత్యాల: జగిత్యాల ఆర్డీవో భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌అన్నారు. ధరూర్‌ క్యాంప్‌లో భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఆర్డీవో మధుసూదన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాంమోహన్‌, హౌసింగ్‌ డీఈ భాస్కర్‌ ఉన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

మల్యాల: వాహనదారులు రోడ్డుభద్రత నియమాలు పాటించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ముత్యంపేట శివారులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రదేశాన్ని మంగళవారం రవాణా శాఖ అధికారి సంధానితో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల వేగంపై అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు మూలమలుపుల వద్ద ఓవర్‌ టేక్‌ చేయవద్దని సూచించారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాజ్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ రహదారి అధికారులు పాల్గొన్నారు.

ల్యాబ్‌లతో విద్యార్థుల్లో పరిజ్ఞానం

రాయికల్‌: ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని డీఈవో రాము అన్నారు. మండలంలోని ఆలూరు ప్రాథమిక పాఠశాలలో ఏఎక్స్‌ఎల్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేథస్సు ద్వారా విద్యాబోధన ప్రారంభమైందని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు సులువుగా భాషలపై పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. ఏఎంవో చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో రాఘవులు, ప్రధానోపాధ్యాయులు సతీశ్‌, సర్పంచ్‌ నల్లాల స్వామిరెడ్డి, ఉపసర్పంచ్‌ మహేశ్‌, విద్యాకమిటీ చైర్మన్‌ సంజీవ్‌, ఉపాధ్యాయులు సాయికృష్ణ, సునీత, రమేశ్‌ పాల్గొన్నారు.

నానో ఎరువులపై అవగాహన

మేడపల్లి: భీమారం మండలం మన్నెగూడెం, లింగంపేట, గోవిందారం గ్రామాల్లో జిల్లా ప్రధాన శాస్త్రవేత్త ఎ.విజయ్‌ భాస్కర్‌ మంగళవారం పర్యటించారు. పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, వ్యవసాయ సాంకేతిక సమస్యలతోపాటు నానో ఎరువులౖపైపె అవగాహన కల్పించారు. వరి, పత్తి, పసుపు, కంది, మొక్కజొన్న, కూరగాయల సాగును పరిశీలించారు. మేడిపల్లి మండలం పోరుమల్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వివరించారు. డీఏవో భాస్కర్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement