క్రీడలతో స్నేహభావం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జగిత్యాలక్రైం: క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి అన్నారు. ఎస్పీ కార్యాలయం మైదానంలో పోలీస్‌ స్పోర్ట్స్‌మీట్‌ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పనిఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు స్పోర్ట్స్‌మీట్‌ చాలా అవసరమన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఇలాంటి క్రీడాపోటీలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. ఓవరాల్‌ చాంపియన్‌గా డీఏఆర్‌ జగిత్యాల, టగ్‌ఆఫ్‌వార్‌లో డీఏఆర్‌ జగిత్యాల, రన్నరప్‌గా జగిత్యాల సబ్‌ డివిజన్‌, వాలీబాల్‌ విజేతగా డీఏఆర్‌ జగిత్యాల, రన్నరప్‌గా జగిత్యాల సబ్‌ డివిజన్‌, క్రికెట్‌ విజేతగా డీఏఆర్‌ జగిత్యాల, రన్నరప్‌గా వింగ్స్‌, హ్యాండ్‌బాల్‌ విజేతగా డీఏఆర్‌ జగిత్యాల, రన్నరప్‌గా మెట్‌పల్లి సబ్‌ డివిజన్‌ నిలిచాయి. విజేత జట్లకు రత్నపద్మావతి, ఎస్పీ అశోక్‌కుమార్‌ బహుమతులు ప్రదానం చేశా రు. అదనపు ఎస్పీ చేతన్‌నితిన్‌, డీఎస్పీలు పురుషో త్తంరెడ్డి, రాములు, సీఐలు ఆరిఫ్‌ అలీఖాన్‌, సుధాకర్‌, కరుణాకర్‌, రాజకుమార్‌, లక్ష్మీనారాయణ, కిరణ్‌ కుమార్‌, సైదులు, వేణు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement