నేడు కేవీ భవనానికి శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

నేడు కేవీ భవనానికి శంకుస్థాపన

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

● కనుమరుగవుతున్న తాటిపల్లి నల్లగుట్ట● పట్టించుకోని అధికారులు

జగిత్యాల: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనా నికి ఆదివారం శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. చల్‌గల్‌లోని వాలంతరీ కేంద్రంలో ఐదెకరాలు కేటా యించామని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హాజరవుతున్నారని తెలిపారు.

కేవీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశా..

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తాను ఎంతో కృషి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాలంతరీ అటానమస్‌ సంస్థ అని, ఇందులో స్థలం ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కూ ఇక్కడే స్థలం కేటాయించామన్నారు. జగిత్యాలకు నవోదయ విద్యాలయం మంజూరుచేయాలని కోరితే కోరుట్లలో ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, నాయకులు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్‌, బండ శంకర్‌ పాల్గొన్నారు.

రెవెన్యూ భూమిలో అక్రమ తవ్వకాలు

జగిత్యాలరూరల్‌: జగిత్యాలరూరల్‌ మండలం తాటిపల్లి శివారు నల్లగుట్టకు మూడు రోజులుగా పొక్లెయిన్లతో తవ్వకాలు చేపడుతున్నారు. మోరపల్లి వెళ్లే రోడ్డులో చల్‌గల్‌ శివారుకు ఆనుకుని ఉన్న నల్లగుట్టను తవ్వుతూ.. భారీ ఎత్తున మట్టి తరలిస్తున్నారు. అడ్డు వచ్చిన చెట్లను తొలగిస్తున్నారు. దీనిపై తాటిపల్లి, చల్‌గల్‌ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రెవెన్యూ భూమిలో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement