మారుపేరు సింగరేణి సంతానానికి తాత పేర్లతో మ్యాపింగ్
కొందరు పాత పేరుతో కొనసాగేందుకు నిర్ణయం
గల్ఫ్ కార్మికులకు సజావుగా సర్ ప్రక్రియ
ఒకరికొకరు దొరకని ఓటర్లు, బీఎల్వోలు
నగర, పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా ప్రక్రియ
తాత పేరు లేదా?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లావాసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఓటర్లుగా మారిన వారి పిల్లలకు తాతలు, నానమ్మలు కీలకంగా మారారు. రెండు దశాబ్దాల కింద సొంతూళ్ల వారు వేసిన ఓట్లే ప్రస్తుత సర్‌లో సాయపడుతున్నాయి. మారుపేరుతో సింగరేణిలో విధులు నిర్వహించిన పలు సింగరేణి కార్మికులు సర్ ప్రక్రియలో తమ సొంత పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 2002లో మారుపేరుతో పనిచేసిన కార్మికుల్లో చాలామంది సొంతూళ్లకు వచ్చాక సొంతపేరుతో ఓటు నమోదు చేయించుకున్నారు. వీరందరి ఓట్లకు మ్యాపింగ్ చేసే సమయంలో 2002 జాబితాలో వీరు ఓటేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. దీంతో వీరు, కుటుంబ సభ్యులు తమ ఓట్లు పోయినట్లేనని ఆందోళన చెందుతున్నారు.
– సాక్షిప్రతినిధి, కరీంనగర్


