మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వా రి సన్నిధిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, అశోక్, రాజేందర్ రెడ్డి, ఎస్సై ఎస్.సందీప్, ఏఎస్సై రమణా రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
జగిత్యాల: వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యా న్సర్‌కు చెక్ పెట్టవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. ఐఎంఏ హాల్‌లో పలువురు యువతులకు శనివా రం వ్యాక్సిన్ వేశారు. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి ఒక్క రు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధీర్‌కుమార్, వైద్యులు శ్రీలత పాల్గొన్నారు.
బీజేపీకి చిట్నేని రఘు రాజీనామా
మెట్‌పల్లి: కోరుట్ల నియోజవర్గంలో బీజేపీలో కీలకనేతగా ఉన్న డాక్టర్ చిట్నేని రఘు ఆ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. కొంతకాలంగా నియోజకవర్గ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆయన.. స్థానికంగా పార్టీని ఏకతాటిపై నడిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ పెద్దలతో ఆయనకు విభేధాలు ఏర్పడ్డాయి. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటినుంచి పార్టీలో గ్రూపు రాజకీయాలు చోటు చేసుకున్నాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సమన్వయంతో ముందుకు సాగిన పార్టీ వర్గపోరుతో అస్తవ్యస్తంగా మారిందనే చర్చ సాగుతోంది. రఘు త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది.
పశువులకు లంపీస్కిన్ నివారణ టీకాలు
గొల్లపల్లి: మండలంలోని రాఘవపట్నంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు లంపీస్కిన్ నివారణ టీకాలు వేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా నాలుగు నెలలు పైబడిన దూడలు, ఎడ్లు, ఆవులకు సర్పంచ్ కాసారపు భవాని ఆధ్వర్యంలో టీకాలు వేశారు. రైతులు వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు టీకాలతో పూర్తిగా అరికట్టవచ్చని మండల పశు వైద్యాధికారి రవీందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిరవేణి రవి, రైతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇంటికే సాయం
మెట్‌పల్లిరూరల్: కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా నేరుగా ఆ ప్రజాప్రతినిధే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు చెక్కులు అంది స్తున్నారు. అనారోగ్య కారణాలతో వైద్యఖర్చులు భరించలేని పేద కుటుంబాలు సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. శనివారం మెట్‌పల్లి, వేంపేట, వెల్లుల, జగ్గాసాగర్, రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వెళ్లి చెక్కులు అందించారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 12 మంది లబ్ధిదారులకు రూ.5.14లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. మెట్‌పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి
కోరుట్ల/కోరుట్లరూరల్: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మె ల్యే సంజయ్ అన్నారు. పట్టణంలోని జూనియ ర్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించారు. పోటీల్లో 686 మంది క్రీడాకారులు పాల్గొనటం అభినందనీయమన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి ఏలేటి ముత్తిరెడ్డి, కౌన్సిలర్ సురేందర్, క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారు.


