కథలాపూర్(వేములవాడ): కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, వసతులతో కూడిన విద్య అందిస్తుండటంతో బాలికలకు వరంగా మారాయి. జిల్లాలో 16 కేజీబీవీలు ఉండగా.. 12చోట్ల ఇంటర్ వరకు.. మిగి లిన నాలుగింటిలో పదో తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు నేరుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(వైఐఐఓఈ) గా గుర్తించారు. వీటిలో ఇంటర్‌తోపాటు పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని అధికారులు చెబుతున్నారు.
మూడు కేజీబీవీలు వైఐఐఓఈగా మార్పు
జగిత్యాల, కోరుట్ల, ఇబ్రహీంపట్నంలోని కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(వైఐఐఓఈ)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాలలో నీట్, కోరుట్లలో జేఈఈ, ఇబ్రహీంపట్నంలో క్లాట్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి. పైగా లక్షల ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని దృష్ట్యా ఎంపిక చేసిన కేజీబీవీల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్‌కు అడ్మిషన్లు స్వీకరించనున్నారు. ఇందులో ప్రవేశాలకు విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 3న టీజీఆర్‌జేసీ సెట్ –2026 ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇందులో అవకాశం కల్పిస్తారని జీసీడీవో నీరజ తెలిపారు.
పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ
జిల్లాలో మూడు విద్యాలయాల ఎంపిక


