పైరవీలతో తిష్ట! | - | Sakshi
Sakshi News home page

పైరవీలతో తిష్ట!

Mar 16 2026 7:50 AM | Updated on Mar 16 2026 7:50 AM

కోరుట్లరూరల్‌: ఉద్యోగులు పారదర్శకంగా విధులు నిర్వహించడంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా కోరుట్ల మండలంలో పలువురు ఉద్యోగులు ఒకేచోట ఏళ్ల తరబ డి కొనసాగుతున్నారు. బదిలీల ఆర్డర్లు వచ్చినా ఉన్నచోటే తిష్ట వేస్తున్నారు. ఇలాంటి అధికారులు అన్ని శాఖల్లో ఉన్నా ముఖ్యంగా పంచాయతీరాజ్‌ శాఖలో ఓ ఉద్యోగి, వ్యవసాయ శాఖలో ఓ మండల స్థాయి అధికారి ఏళ్ల తరబడి తిష్ట వేశారనే విమర్శలు ఉన్నాయి. గెజిటెడ్‌ ఉద్యోగి గరిష్టంగా ఐదేళ్ల లో పు, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగి 8 ఏళ్లలోపు బదిలీ కావా లనే ప్రభుత్వ నిబంధన ఉంది. కొందరు ఉద్యోగులు ఆరోగ్య, ఇతర కారణాలు చూపి ఉన్నచోటే ఎక్కువ రోజులు కొనసాగుతూ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిసిస్తున్నాయి. పారదర్శకంగా ఉద్యోగ నిర్వహణతో పాటు, జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు.. ప్రజల అవసరాలు, వ్యక్తిగత సమస్యలు, వైఫల్యాలు గుర్తెరిగి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.

ఆ అధికారి రూటే సెపరేటు..

మండలంలోని ఓ మేజర్‌ గ్రామపంచాయితీకి కార్యదర్శిగా ఉన్న ఉద్యోగి ఆరెడేళ్లుగా అక్కడే కొనసాగుతున్నారు. సదరు ఉద్యోగిపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు షోకాజ్‌ నోటీసులు కూడా అందుకున్నాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ ఇక్కడే కొనసాగుతున్నట్టు తెలి సింది. అధిక ఆదాయం ఉన్న మేజర్‌ పంచాయతీ కావడంతో సదరు ఉద్యోగికి జిల్లాస్థాయిలో కూడా గుర్తింపు ఉంది. గతంలో ఓ జిల్లా స్థాయి అధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆ అధికారి కోరిక మేరకు ఇదే పంచాయతీ సెక్రటరీ ఓ దినపత్రికలో యాడ్‌ ఇచ్చి తన విధేయతను చాటుకున్నాడు. ఇలా జిల్లాస్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుంటుండడంతో ఆ ఉద్యోగిపై ఆరోపణలు ఉన్నా బదిలీ చేయడం లేదని తెలిసింది. వ్యవసాయశాఖలో మండలస్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి కూడా సుమారు ఆరేడేళ్ల నుంచి ఇక్కడనే కొనసాగుతున్నారు. గెజిటెడ్‌ అధికారి కావడంతో 5 ఏళ్ల నిబంధన ఉన్నా మెడికల్‌ సర్టిఫికెట్‌తో బదిలీ నుంచి మినహాయింపు పొందినట్టు తెలిసింది. కాగా అధికారులు ఎక్కువ కాలం పాటు ఒకేచోట ఉండటం వల్ల ప్రజలకు పారదర్శక సేవలు అందకపోవడంతో పాటు జవాబుదారీ తనం కరువైంది.

ఏళ్ల తరబడి ఉన్న చోటే ఉద్యోగం

ఇష్టారాజ్యంగా విధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement