పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఏయే విడతలో.. ఏ మండలాలో ప్రణాళిక అందించాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటరు జాబితాకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈనెల 22లోపు పరిష్కరించాలన్నారు. ఈనెల 23న ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫొటోలతో కూడిన ఓటరు జాబితా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, లత, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో రేవంత్ పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని


