వరికొయ్యలను ఎందుకు కాల్చుతున్నారు..?
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం వరి పంట కోసిన తర్వాత.. రెండో పంట వేసేందుకు రైతులు కొయ్యకాళ్లను కాలబెడుతున్నారు. ఫలితంగా వాతావరణ కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పైగా భూమికి ఏ మాత్రమూ ఉపయోగం ఉండడంలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీవంటి నగరాల్లో వాతావరణ కాలుష్యంతో స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు తక్షణమే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అదేశాలు జారీ అయ్యాయి.
సేంద్రియ కర్బనం అంతంతే
భూమిలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, పంట అవశేషాలు, పచ్చిరొట్ట ఎరువులు వేసి కలియదున్నినప్పుడు సేంద్రియ కర్బనం ఏర్పడుతుంది. వాటితో భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అవి భూమిలో సహజసిద్ధంగా ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎప్పటికప్పుడు మొక్కకు అందిస్తూ పెరుగుదలకు సహకరిస్తాయి. రైతులు చల్లే రసాయన ఎరువుల్లోని పోషకాలను మొక్కకు అందించడంలో కీలకపాత్ర వహిస్తాయి. రైతులు రకరకాల కారణాలు చెప్పి భూమిలో సత్తువ తెచ్చే సేంద్రియ ఎరువులు వేయడం లేదు. ఫలితంగా భూమిలో సేంద్రియ కర్బనం లేకుండాపోతోంది. కనీసం పంటలో పనికి రాని కలుపు మొక్కలు, పంట అయిపోయిన తర్వాత ఏర్పడే చెత్తాచెదారం(పత్తి కట్టె, వరి కొయ్యకాళ్లు) భూమిలో కలియదున్నాలని సూచిస్తున్నా రైతులు పట్టించుకోవడం మానేశారు.
పంట అవశేషాలకు అగ్గి
ఒ రైతును చూసి, మరో రైతు పంట అవశేషాలను కాలబెడుతున్నారు. దీంతో భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అవశేషాలను కాలబెట్టినప్పు డు వాతావరణంలోని కార్బన్‌డయాకై ్సడ్, కార్బన్‌మోనాౖక్సైడ్‌గా మారుతుంది. దీంతో పొగతో వాతావరణం కలుషితమవుతోంది. పొగతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రైతులు కొయ్యకాళ్లను కాల్చకుండా.. రోటోవేటర్‌తో కలియదున్నితే భూమిలో కలిసి పెద్దగా రసాయన ఎరువు ల అవసరం లేకుండా పంటలు పండించుకోవచ్చు.
సీరియస్ అయిన సర్కారు
రైతులకు అవగాహన సదస్సులు
కాలుష్యంతో శ్వాసకోశవ్యాధులు


