చలితో చిన్నారుల్లో నిమోనియా
సారంగాపూర్: చలి తీవ్రత అధికమవుతోందని, దీనిద్వారా ఐదేళ్లలోపు చిన్నారుల్లో నిమోనియో వచ్చే ప్రమాదం ఉందని, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. బీర్‌పూర్ మండలం కొల్వాయిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను గురువారం సందర్శి ్డంచారు. వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. పరీక్షలు చేసి మందులు అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆశకార్యకర్తలు గ్రామంలో ని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు. బీపీ, షుగర్ బాధితులకు మందులు అందించాలని సూచించారు. అనంతరం సారంగాపూర్ పిహెచ్‌సిని సందర్శించారు. ఆయన వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్, మండల వైద్యాధికారి రాధారెడ్డి, సీహెచ్‌వో కుద్దూస్, సూపర్‌వైజర్ కిశోర్, అనిల్, దామోదర్, సిబ్బంది ఉన్నారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్


