పొలాస విత్తనాలకు భలే గిరాకీ
విత్తనాల కోసం క్యూ కట్టిన రైతులు
గోదాం నుంచి విత్తనాలు తీసుకుంటున్న రైతులు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన వరి విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు రూపొందించిన జేజీఎల్–24423, జేజీఎల్–28639 విత్తనాలను వర్షకాలంలో కొద్ది విస్తీర్ణంలో సాగు చేశారు. ఆ విత్తనాలను యాసంగి సీజన్‌కు విక్రయిస్తుండటంతో రైతులు క్యూ కడుతున్నారు. గురువారం ఒక్కరోజే 500 మంది రైతులు విత్తనాల కోసం రావడంతో వారికి సర్దిచెప్ప లేక శాస్త్రవేత్తలు తంటాలు పడ్డారు.
పొలాస విత్తనాలకు భలే గిరాకీ


