పార్టీ మారిన వారిపై చర్యలు తప్పవు
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: రాజ్యాంగం, స్పీకర్‌పై తనకు అపారమైన నమ్మకం ఉందని, పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని సర్వేనంబర్ 138లోగల ప్రభుత్వ భూమిని బల్దియా అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. పెట్రోల్ పంపు నిర్వహిస్తున్న నాలుగు గుంటల స్థలం మినహాయించి మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు 2004లో అప్పటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం నంబర్ 140ద్వారా నిర్ణయించిందన్నారు. మున్సిపల్ తీర్మానాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించగా వారి పొజిషన్‌ను కంటిన్యూ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లగా ఆక్రమిత భూమిపై చర్యలు చేపట్టే వరకు మున్సిపల్ తీర్మానాన్ని పక్కన పెట్టాలని మాత్రమే తీర్పులో పేర్కొందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. యావర్‌రోడ్డులోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలన్నారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, మన్సూర్, జున్ను రాజేందర్, మహ్మద్ బారీ, నేహాల్ ఉన్నారు.
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
జగిత్యాలటౌన్: విద్యార్థులు, యువత ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్లి పుస్తకం చదువుకునే అలవాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ గ్రంథా లయాల ప్రాధాన్యతను ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రశ్నించడం ద్వారా నేర్చుకునే అలవాటు చేసుకోవాలన్నారు. డీఈవో రాము, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
వీధివ్యాపారులకు రుణాలు అందించాలి
జగిత్యాల: వీధివ్యాపారులకు బ్యాంకులు రుణాలు అందించేలా చూడాలని రాజాగౌడ్ అన్నారు. మున్సిపల్, మెప్మా బ్యాంక్ మేనేజర్లతో సమావేశమయ్యారు. వీధివ్యాపారులకు అనుగుణంగా వెండింగ్ జోన్స్ నిర్ణయించాలన్నారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ పథకం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. ఏఎస్పీ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్లు రవీందర్, మోహన్, శ్రీనివాస్‌రావు, మనోహర్, ఎంపీడీవోలు రామకృష్ణ, సురేశ్, విజయలక్ష్మీ, మెప్మా ఏవో శ్రీనివాస్‌గౌడ్, లీడ్ ఇండియా మేనేజర్ రాంకుమార్, ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ శశిధర్ పాల్గొన్నారు.
మహిళలందరికీ చీరెల పంపిణీ
జగిత్యాల: స్వశక్తిసంఘాల మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. రూరల్ పరిధిలో డిసెంబర్ 9 వరకు పంపిణీ ఉంటుందని, బల్దియాల్లోని మెప్మా మహిళలకు మార్చి 1 నుంచి 8 వరకు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు 2,39,950 చీరలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1,38,715 వచ్చాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో వస్తాయని వివరించారు. రెండో విడత మున్సిపాలిటీల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మరమ్మతు పనుల పరిశీలన
మెట్‌పల్లి: పట్టణంలోని వెంకట్రావుపేట వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలకు చేపడుతున్న మరమ్మతు పనులను గురువారం కమిషనర్ మోహన్ ప రిశీలించారు. పనుల పూర్తికి సంబంధించిన సమాచారాన్ని భగీరథ అధికారులను అడుగగా, శుక్రవారం మధ్యాహ్నం లోపు పూర్తి చేస్తామని వారు తెలిపారు. మరమ్మతులతో ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ సూచించారు.
పార్టీ మారిన వారిపై చర్యలు తప్పవు


