
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
కోరుట్ల: పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను అరికట్టవచ్చని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివా స్ అన్నారు. పట్టణంలోని ఏసికోనిగుట్ట ప్రాంతానికి చెందిన పసులోటి వెంకటేశం (48) జ్వ రంతో మృతిచెందిన విషయం తెల్సిందే. అలాగే పట్టణంలో పలువురు జ్వరాల బారిన పడుతుండటంతో ‘సాక్షి’ మంగళవారం ‘డెంగీబెల్స్’ శీ ర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన శ్రీనివాస్ వెంకటేశం ఇంటికి వెళ్లి పరిసరాలు పరిశీలించారు. ఏసికోని గుట్ట ప్రాంతంలో పారి శుధ్య చర్యలు చేపట్టారు. పలు ఇళ్లలోకి వెళ్లి ప్లాస్టి క్ డబ్బాలు, కూలర్లు, రోళ్లలో ఉన్న నీటిని తొలగించారు. 28 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి రక్త పరీక్షలు చేపట్టగా.. నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో అయిలాపూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సమీనా, హెల్త్ సూపర్‌వైజర్ జక్కని ధనుంజయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం