జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Aug 27 2025 8:59 AM | Updated on Aug 27 2025 8:59 AM

జగిత్

జగిత్యాల

బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025 ● అడుగడుగునా గుంతలు ● వాహనాలు పడిపోయే ప్రమాదం ● కురుస్తున్న వర్షాలకు మోకాలు లోతు ● నేటి నుంచి వినాయక చవితి వేడుకలు ● ఎత్తైన విగ్రహాలు నెలకొల్పుతున్న నిర్వాహకులు ● గణేశుడి శోభాయాత్రకు జిల్లాకు రూ.25 లక్షల నిధులు ● నిమజ్జనం వరకై నా రోడ్లను బాగు చేయాలంటున్న ప్రజలు ● ఆరుగ్యారంటీల అమలులో విఫలం ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఫొటో పంపాల్సిన సెల్‌ నంబర్‌: 85007 86474

న్యూస్‌రీల్‌

ఎస్‌యూ పరిధిలో జోరుగా చూచిరాతలు దొరికాక రాజకీయ నేతలతో ఫోన్లు మా వారినే డీబార్‌ చేస్తారా అంటూ రంగంలోకి లీడర్లు డ్యూటీ చేస్తే ఒత్తిళ్లా అంటూ వాపోతున్న సిబ్బంది వెనకడుగు వేస్తే ప్రతిఘటిస్తామంటున్న విద్యార్థి సంఘాలు జరిగిన వ్యవహారంపై ఆరా తీసిన ఇంటెలిజెన్స్‌

బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025
గణేశుడు వచ్చిపోయేదెలా..
గిరిజన గ్రామాల్లో వసతులు

9

సెల్ఫీ విత్‌ మట్టిగణపతి

సర్వ విఘ్నాలకు అధిపతి.. తొలి పూజలందుకునే ప్రథమ గణాధిపతి. బుధవారం వినాయక చవితి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించి ఆదిదేవుడిని కొలిచేవారిని సాక్షి ‘సెల్ఫీ విత్‌ మట్టి గణపతి’ ఆహ్వానిస్తోంది. మీరు ప్రతిష్ఠించిన మట్టి వినాయక ప్రతిమతో పండుగరోజు సెల్ఫీ దిగి పంపిస్తే మేం ప్రచురిస్తాం. మంచి ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తాం.

రోడ్లు

ఇలా..

రైతులకు ఇబ్బంది కలిగించొద్దు

జగిత్యాల: యూరియా పంపిణీ విషయంలో రైతులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. 20 మండలా ల్లోని 51 పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నట్లు వెల్లడించారు. యూరి యా సరఫరా నిరంతర ప్రక్రియ అన్నారు. ఇప్పటివరకు 27,479 టన్నులు అందించామన్నారు. గతేడాదితో పోలిస్తే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్యాక్స్‌, ప్రైవేటు అవుట్‌లెట్‌ ద్వారా సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఏవో భాస్కర్‌, డీసీవో మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు

బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు నిరసనలు, ధ ర్నాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అన్నారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. యూరియా సరఫరా పూర్తిగా కేంద్రం పరిఽధిలో ఉందన్నారు. కేంద్రమంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైతులు ఎ లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు యూరియా అందిస్తామన్నారు.

పుష్కరఘాట్ల పరిశీలన

ధర్మపురి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో అదనపు కలెక్టర్‌ లత ధర్మపురిలోని గోదావరి తీర ప్రాంతంలో గల పుష్కరఘాట్లను మంగళవారం పరిశీలించారు. 2027 జూలైలో జరిగే పుష్కరాలల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళిగడ్డ, మహాలక్ష్మి, సీతారామచంద్ర, సంతోషిమాత ఘాట్‌లను పరిశీలించి అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెవెంట ఆలయ ఈవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన

జగిత్యాలఅగ్రికల్చర్‌: పొలాస వ్యవసాయ కళాశాల టీచింగ్‌ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీచింగ్‌ స్టాఫ్‌పై వ్యవసాయ యూనివర్సిటీ ఉన్నతాధికారుల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పరిశోధన స్థానం డైరెక్టర్‌ హరీశ్‌కుమార్‌శర్మకు వినతిపత్రం అందించారు. టీచింగ్‌ స్టాఫ్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ఉద్యోగులను మానసికంగా వేధిస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పారదర్శకత లేకుండా ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేశారని తెలిపారు. పదోన్నతుల్లోనూ అన్యాయం జరుగుతోందని, ట్రాన్స్‌ఫర్‌ ట్రావెల్‌ అలవెన్స్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు.

జిల్లాకు మోస్తరు వర్ష సూచన

జగిత్యాలఅగ్రికల్చర్‌: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శారస్త్‌రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల 27నుంచి 30వరకు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలలు వీచే అవకాశం ఉందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల: స్థానిక వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీలను కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ షర్మిల తెలిపారు. ప్రొఫెసర్లు 7, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 28, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 18, సీనియర్‌ రెసిడెన్సీలు 28 పోస్టులు భర్తీ చేస్తామని, అర్హులు సెప్టెంబర్‌ 1న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాలలో హాజరు కావాలని, వివరాల కోసం WWW.G MC-J-A-GT-I-A-L.CO MÌలో లాగిన్‌ అయి తెలుసుకోవచ్చన్నారు.

జగిత్యాల: జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు గణనాథుని విగ్రహాలు తరలివెళ్తుంటాయి. జిల్లా కేంద్రంలోనే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గణనాథులు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడానికి నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానమైన రోడ్లలో ఎక్కడబడితే అక్కడ గుంతలు ఉండటం.. మున్సిపల్‌ అధికారులు కనీసం మరమ్మతులు చేయించకపోవడంతో గుంతల్లో వాహనాలు పడి ఇబ్బందికరంగా మారింది. కనీసం శోభాయాత్ర వరకై నా మరమ్మతు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

జిల్లా కేంద్రంలో ప్రధాన చోట్లలో ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు ఉన్నాయి. కనీసం విద్యుత్‌ అధికారులు వాటిని సరిచేయకపోవడంతో పెద్దపెద్ద గణనాథులు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. సాయిబాబా గుడి సమీపంలో వెళ్తున్న ఒక గణనాథుడు అతిపెద్దగా ఉండటంతో కరెంట్‌ వైర్లను తాకింది. పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల జిల్లాలోని కోరుట్లలో గణనాథులను తరలిస్తున్న సమయంలో కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందిన విషయం తెలిసిందే. శోభాయాత్ర వరకై నా విద్యుత్‌ అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

శోభయాత్రకు రూ.25 లక్షల నిధులు

జగిత్యాల మున్సిపాలిటీలో వినాయకుని శోభా యాత్ర కోసం రూ.25 లక్షల నిధులు కేటాయించారు. గుంతలను మొరంతో పూడ్చడం, లైటింగ్‌, తాగునీటి సరఫరా, క్రేన్స్‌ తదితర వాటి కోసం నిధులు కేటాయించారు.

గణేశ్‌ ఉత్సవాలకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?

ఎస్పీ: నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి వినాయక మండపం నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా అవగాహన కల్పించాం. మండపాల వద్ద సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో నలుగురు వ్యక్తులు అక్కడే ఉండాలని సూచిస్తున్నాం.

ఎంతమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు..?

ఎస్పీ: వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం సుమారు వెయ్యి మంది పో లీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ యల్‌ 100 సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు ఎప్పు డూ బందోబస్తును పర్యవేక్షిస్తుంటారు. ఇప్పటికే 684 మంది డీజే నిర్వాహకులు, రౌడీషీటర్లు, సమస్యలు సృష్టించే వారిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశాం.

ప్రజలకు మీ సూచన, సలహాలు..?

ఎస్పీ: జిల్లా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. ప్రతి మండపంలో భద్రతలోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలి.

చవితి

సందడి

కారులో బుజ్జి గణనాథులు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

జగిత్యాలటౌన్‌: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి

సందడి నెలకొంది. బుధవారం నుంచి ప్రారంభంకానున్న పండుగను పురస్కరించుకుని మంగళవారం గణనాథులను మంటపాలకు

తరలించారు. పూజా సామగ్రి, బొజ్జ గణపయ్యల కొనుగోలుతో మార్కెట్‌ సందడిగా మారింది.

జగన్నాథపూర్‌ గ్రామాన్ని

సందర్శిస్తున్న జిల్లా కలెక్టర్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

శాతవాహన వర్సిటీ పరిధిలో జరుగుతున్న న్యాయపరీక్షల్లో పట్టుబడుడుతున్న కాపీరాయుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల డిగ్రీ పరీక్షల్లో డీబార్‌ అయిన ఓ విద్యార్థికి మద్దతుగా ఉత్తారిదికి చెందిన ఓ సీనియర్‌ మంత్రి ఫోన్‌ చేసిన విషయం మరవకముందే.. అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. యథేచ్ఛగా చిట్టీలు పెట్టి రాస్తూ.. వర్సిటీ సిబ్బంది పట్టుకుంటే వెంటనే వారిపై ఒత్తిళ్లు తెస్తూ.. బెదిరిస్తున్నారు. వినకపోతే ఆఖరి అస్త్రంగా రాజకీయ నాయకులను రంగంలోకి దించుతున్నారు. వర్సిటీలో ఇటీల జరిగిన కొన్ని పరిణామాలు సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఓ ‘లా’ విద్యార్థి ఈనెల 18న కాపీ కొడుతూ వర్సిటీలో దొరికిపోయాడు. వదిలేయాలని కోరాడు. సిబ్బంది వినలేదు. దీంతో పలువురు రాజకీయ నాయకులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని డీబార్‌ చేసిన అధికారులు తామేం చేయలేమని చేతులెత్తేశారు. మరో ఘటనలో నగరానికి చెంది ఓ పార్టీ నాయకుడు నామినేటెడ్‌ పోస్టులో కొనసాగుతున్నాడు. అతను కూడా లా పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఈ యన సైతం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగా డు. కాపీ కొడుతూ దొరికిన సంగతి మరిచి, తనను వదిలేయాలంటూ వాదించసాగాడు. యూనివర్సి టీ సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా అతన్ని డీబా ర్‌ చేసేశారు. ఒక్క పరీక్షలో దొరికి డీబార్‌ అయినా నిబంధనల ప్రకారం.. మొత్తం సెమిస్టర్‌ పరీక్షలన్నీ వచ్చే ఏడాది రాసుకోవాలి. ఉదాహరణకు ఒక సెమిస్టర్‌లో ఐదు పేపర్లు ఉన్నాయనుకుంటే.. అందులో ఆఖరు పేపరు రోజు కాపీ కొట్టి దొరి కితే.. మొత్తం పరీక్షల్లో డీబార్‌గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం పేపర్లు మరో ఏడాది వరకు రాసుకోవాలి.

వారం దాటినా ఆగని ఫోన్లు

వాస్తవానికి ఆ ఒత్తిళ్ల వ్యవహారం ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. సదరు అధికారులకు వారం రోజులైనా ఫోన్ల తాకిడి ఆగలేదు. ‘మా వాడిని కొంచెం చూడండి.. డీబార్‌ రద్దు చేయండి’ అంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, సెలవు దినం అన్న తేడా లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఒకసారి డీబార్‌ చేసిన తరువాత దాన్ని ఎత్తేయడం అంటూ ఉండదు. ఇదే విషయాన్ని ఫోన్‌ చేసే వారికి వివరించినా అర్థం కావడం లేదంటూ వర్సిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వీరి వ్యవహారం తెలిసి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వర్సిటీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించాయి. డీబార్‌ ఎత్తివేస్తే ఊరుకునేది లేదని, వర్సిటీ ఎదుటే ఆందోళనకు దిగుతామంటూ స్పష్టంచేశాయి. దీంతో సిబ్బంది ఇటు కాపీ రాయుళ్లు, అటు విద్యార్థి సంఘాల మధ్య నలిగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇంటెలిజెన్స్‌ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి.. అసలేం జరిగిందో తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదిక పంపారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు

జగిత్యాల: ఆరుగ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్‌ చౌరస్తాలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల్లో లేవన్నారు. ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకుంటూ పాదయాత్ర చేయాలన్నారు. తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్‌, రైతుభరోసా ఏదని ప్రశ్నించారు. నాయకులు ఆనందరావు, మల్లేశ్‌, రాజు, వొల్లం మల్లేశం, మహేశ్‌, రమణ, దేవేందర్‌నాయక్‌, ప్రవీణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు

రెసిడెన్షియల్స్‌లో విద్యార్థులు జ్వరంతో బాధపడుతుంటే ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని భవానీనగర్‌లోని గర్‌ల్స్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో వంద మందికిపైగా విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుసుకుని హాస్టల్‌ను సందర్శించారు. వైద్యాధికారులు వెంటనే హెల్త్‌క్యాంప్‌ నిర్వహించాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు.

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా

జగిత్యాలక్రైం: జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిఽ దిలో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చే యాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గ్రేవ్‌ కేసులు, అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఉన్న కేసులు, సీడీ ఫైల్స్‌ను, పెండింగ్‌ ట్రయల్‌లో ఉన్న సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. అనంతరం సీఐ కార్యాలయంలో మొక్కలు నా టా రు. డీఎస్పీ రఘుచందర్‌, డీసీఆర్బీ సీఐ శ్రీని వా స్‌, రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సైలు సదాకర్‌, సుఽ దీర్‌రావు, గీత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా పోస్టులపై..?

ఎస్పీ: మండపాల నిర్వాహకులతో ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, ఎవరైనా పోస్టు చేస్తే.. దానిని ఫార్వర్డ్‌ చేయవద్దని సూచించాం. పోస్టులపై ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించాం.

జిల్లాలో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది..?

ఎస్పీ: గతేడాది 3,041 విగ్రహాలను నెలకొల్పారు. ఈ ఏడాది 3500 విగ్రహాలు ఏర్పాటు చేస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా 1667 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి వినాయక మండపానికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్‌తో పాటు, పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేశాం.

రాయికల్‌: గిరిజన గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మండలంలోని జగన్నాథపూర్‌ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. సీసీ, బీటీరోడ్లు, డ్రైనేజీ, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాల్‌, వాటర్‌ట్యాంక్‌ వంటి సౌకర్యాలను గుర్తించి అవసరమైన వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌, డీపీవో మదన్‌మోహన్‌, పీఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్‌ నాగార్జున, పీఆర్‌ ఏఈ ప్రసాద్‌ ఉన్నారు.

ఇది చాలా సాధారణ విషయం

వాస్తవానికి వర్సిటీలో ఈ ఘటన ఈనెల 18న జరిగింది. చాలా సాధారణ విషయం. కొందరు దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. సహజంగానే ఈ రోజుల్లో న్యాయపరీక్షలకు ఉన్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ తదితరులు హాజరవుతున్నారు. పరీక్షల్లో కొందరు కాపీ కొడుతూ దొరకడం, వారికి మద్దతుగా రాజకీయ నాయకులు, వీఐపీలు ఫోన్లు చేయడం మాకు షరా మామూలే. – సురేశ్‌, కంట్రోలర్‌, ఎస్‌యూ

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని ఉద్యానవనం నుంచి కొత్తబస్టాండ్‌కు

వెళ్లే ప్రధాన రహదారి. ఇక్కడ కొద్దిరోజుల క్రితం మిషన్‌ భగీరథ కోసం

తవ్వి వదిలేయడంతో పెద్ద గుంతగా మారింది. పలుమార్లు అధికారులకు విన్నవించగా కంకర పోయించారు. కొద్దిరోజులకు ఆ కంకర మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు అలాగే ఉంది. వినాయక శోభాయాత్ర వెళ్లాలంటే పరిస్థితి

దారుణంగా ఉంటుంది.

జగిత్యాల1
1/14

జగిత్యాల

జగిత్యాల2
2/14

జగిత్యాల

జగిత్యాల3
3/14

జగిత్యాల

జగిత్యాల4
4/14

జగిత్యాల

జగిత్యాల5
5/14

జగిత్యాల

జగిత్యాల6
6/14

జగిత్యాల

జగిత్యాల7
7/14

జగిత్యాల

జగిత్యాల8
8/14

జగిత్యాల

జగిత్యాల9
9/14

జగిత్యాల

జగిత్యాల10
10/14

జగిత్యాల

జగిత్యాల11
11/14

జగిత్యాల

జగిత్యాల12
12/14

జగిత్యాల

జగిత్యాల13
13/14

జగిత్యాల

జగిత్యాల14
14/14

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement