
సమస్యల పరిష్కారానికి పటిష్ఠ చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారాని కి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసుశాఖ మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుంది
జగిత్యాలక్రైం: పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వెంకట్రావ్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ పదోన్నతి స్టార్‌ను అందజేశారు. విధి నిర్వహణలో పోలీసు శాఖపై నమ్మకం, గౌరవం పెంచేలా విధులు నిర్వహించాలని కోరారు.