
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
మల్యాల: పాఠశాలలకు వెళ్లే పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని మాజీమంత్రి సుద్దాల దేవయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని తాటిపల్లి, బల్వంతాపూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థులకు గురువారం సైకిళ్లు పంపిణీ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 20వేల మందికి సైకిళ్లను అందిస్తున్నారని తెలిపారు. డీఈవో రాము, ఎంఈవో జయసింహారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, హెచ్‌ఎంలు శ్రీనివాస్, పిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.