25 ఎకరాల్లో సాగు చేశా
గతంలో వరి సాగు చేశా. ఆదాయం అంతంతే వచ్చేది. ఆయిల్‌పాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో 25 ఎకరాల్లో సాగు చేస్తున్న. మొక్కలు నాటి రెండేళ్లవుతుంది. మరో ఏడాదిలో గెలలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి.
– రాజశేఖర్‌రావు, పెగడపల్లి
రైతులను ప్రోత్సహిస్తున్నాం
ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగు చేసిన తోటలను, అక్కడి రైతులు, ఫ్యాక్టరీ నిర్వహణను చూపించాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నెలకోసారి కంపెనీతో కలిసి రైతులకు సదస్సులు నిర్వహిస్తున్నాం.
– శ్యాంప్రసాద్,
జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల
25 ఎకరాల్లో సాగు చేశా


