
భూభారతితో సాదాబైనామాలకు పరిష్కారం
మల్యాల: భూ భారతి చట్టంతో సాదాబైనామాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో భూభారతి చట్టంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి అవగాహన కల్పించారు. చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెండింగ్ సాదాబైనామాల పరిష్కారానికి భూ భారతి చట్టం సెక్షన్–6 కింద ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగించిందన్నారు. అధికారులు ఇచ్చిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పీల్ చేసుకునే అవకాశముందన్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేపట్టి, రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తిచేయకుంటే ఆటోమెటిక్‌గా పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతితో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీఓ స్వాతి, ఏఎంసీ చైర్మన్, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
అనంతరం కలెక్టర్ నూకపల్లి, బల్వంతాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనాలన్నారు.
భూభారతి చట్టంతో రైతులకు మేలు
జగిత్యాల: భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. భూభారతి చట్టంపై కొడిమ్యాల మండలం పూడూరులో అవగాహన కల్పించారు. ఏ సమస్యలైనా ఇక్కడే పరిష్కరించుకోవచ్చని సూచించారు.
● కలెక్టర్ బి.సత్యప్రసాద్