● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● పెరుగుతున్న వృద్ధుల ఫిర్యాదులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పిల్లల ఆదరణ కరువైందని, ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ పలువురు వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలపై 35 ఫిర్యాదులు రాగా.. పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, జగిత్యాల కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


