మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి

Mar 9 2025 1:47 AM | Updated on Mar 9 2025 1:42 AM

మెట్‌పల్లి: మహిళలు తమకు ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలని మెట్‌పల్లి సీనియర్‌ సివిల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేజిస్ట్రేట్‌ మాట్లాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అదే సమయంలో వారిపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాలున్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళా న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, కళాశాల కరస్పాండెంట్‌ ఇల్లెందుల శ్రీనివాస్‌ తదితరులున్నారు.

మహిళలు హక్కులను వినియోగించుకోవాలి

అదనపు కలెక్టర్‌ లత

జగిత్యాల: మహిళలు తమ హక్కులను సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె మున్సిపల్‌ ఉద్యోగులు సన్మానించారు. ప్రతి మహిళ రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి ఒక్కటి చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్స్‌ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌రెడ్డి, ఏంఈవో సీతామహాలక్ష్మి, రాష్ట్ర నాయకులు గజభీంకార్‌ గోవర్దన్‌, జిల్లా, మండలి బాఽ ద్యులు, నాయకులు దినేష్‌ తదితరులున్నారు.

పది నుంచి స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం

జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఈనెల 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ సంస్కృతం సబ్జెక్ట్‌కు సంబంధించిన స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభమవుతుందని ఇంటర్‌ నోడల్‌ అధికారి నారాయణ తెలిపారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని, సంస్కృతం అధ్యాపకులు ఈనెల 10న ఉదయం 10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌తో రావాలని, అకౌంట్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ రిపోర్ట్‌ చేయాలని తెలిపారు. మూల్యాంకణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు.

పసుపు రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి

కోరుట్ల రూరల్‌/ఇబ్రహీంపట్నం: పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న మెట్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించే పసుపు రైతుల మహా ధర్నా విజయవంతం చేయాలని రైతు ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోరట్ల మండలంలోని ఐలాపూర్‌, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ పసుపు క్వింటాలుకు రూ. 15000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల రమేశ్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, తెలంగాణా జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్‌ రెడ్డి, పిడుగు సందయ్య పాల్గొన్నారు.

మహిళలు సవాళ్లను  ధైర్యంగా ఎదుర్కొవాలి
1
1/2

మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి

మహిళలు సవాళ్లను  ధైర్యంగా ఎదుర్కొవాలి
2
2/2

మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement