నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా

Published Sat, May 25 2024 12:45 AM

నకిలీ

జగిత్యాలక్రైం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జి ల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేసిన వెంటనే ఫొటోలు సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూ చించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్‌, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని తెలిపారు. ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మ ద్యపానంపై నిఘా పెంచాలన్నారు. జిల్లాలో గంజా యి, మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలని సూచించారు. మార్కెట్లో బీటీ3 పత్తి విత్తనాలకు అనుమతి లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చి విక్రయించే వారివద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల నివారణకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో వ్యవసాయ అధికారుల సాయంతో అన్ని ఎరువుల దుకాణాలు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. డీఎస్పీలు రవీంద్రకుమార్‌, రఘుచందర్‌, ఉమామహేశ్వరరావు, రంగారెడ్డి, వ్యవసాయ అధికారులు, డీసీఆర్బీ, సీసీఎస్‌, ఐటీ కోర్‌ సీఐలు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, రఫీక్‌ఖాన్‌ పాల్గొన్నారు.

రైతులకు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు

నేరసమీక్షలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా
1/1

నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా

Advertisement
 
Advertisement
 
Advertisement