
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
మేడిపల్లి(జగిత్యాల): రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కోరుట్ల ఆర్డీవో ఆనంద్‌కుమార్ హెచ్చరించారు. శ్రీమిల్లర్ల దోపిడీ.. రైతన్న కంటతడిశ్రీ శీర్షికన సోమవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మేడిపల్లి మండలంలోని మేడిపల్లి, పోరుమల్ల, కట్లకుంట ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కట్లకుంట కొనుగోలు కేంద్రంలో రైతులు కంటతడి పెట్టడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వాహకులు తమతో అమర్యాదగా ఉంటున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఏదడిగినా కసురుకుంటూ కోపానికి వస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీవో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్‌లో తూకం వేసిన 2 వేలకు పైగా బస్తాలు ఉంటే మిల్లుకు ఎందుకు పంపించలేదని మండిపడ్డారు. తాగునీరు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించా రు. ధాన్యాన్ని త్వరగా మిల్లుకు పంపించాలని సివి ల్ సప్లయ్ డీఎంను ఆదేశించారు. రైతులతో అమర్యాదగా ప్రవర్తించిన వీవోను సస్పెండ్ చేశారు.
కోరుట్ల ఆర్డీవో ఆనందకుమార్
వీవోపై సస్పెన్షన్ వేటు

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు