ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత

Jun 22 2023 12:32 AM | Updated on Jun 22 2023 12:14 PM

మాట్లాడుతున్న మంత్రి కె.తారక రామారావు, వేదికపై మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు - Sakshi

మాట్లాడుతున్న మంత్రి కె.తారక రామారావు, వేదికపై మంత్రి గంగుల కమలాకర్‌ తదితరులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కరీంనగర్‌ కార్పొరేషన్‌ /కరీంనగర్‌: ప్రజాభాగస్వామ్యంతోనే నగరాల్లో పరిశుభ్రత సాధ్యమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నిర్మించిన కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ.. నాలాలు శుభ్రం చేస్తుంటే సోఫాలు, పరుపులు, కుర్చీలు వస్తున్నాయని, ఈ తీరు మారాలని సూచించారు. సిద్దిపేట స్ఫూర్తిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో స్వచ్ఛబడి ఏర్పాటు చేయాలని ఆదేశించామని, ఇందుకు రూ.79 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తూ హైదరాబాద్‌ నగరం ఏటా రూ.200 కోట్లు, సిరిసిల్లలో స్వశక్తి సంఘాలు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాయని వివరించారు.

సిద్దిపేటలో దీప్తి అనే కౌన్సిలర్‌ స్వచ్ఛబడి నిర్వహిస్తోందని, అలా ఇతర కార్పొరేటర్లు ప్రయత్నించాలని సూ చించారు. తాను జపాన్‌ వెళ్లినప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండడంపై ఆరా తీయగా.. తాము అపరిశుభ్రం చేయకపోవడమే కారణమని అక్కడి ప్రజ లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సపాయిమిత్ర సురక్షలో దేశంలోనే కరీంనగర్‌కు మొదటి స్థానం రావాల్సి ఉన్నా.. కుట్రతోనే ఆ స్థానం గుజరాత్‌కు వెళ్లిందని పేర్కొన్నారు.

నేను పుట్టింది కరీంనగర్‌లోనే..
కరీంనగర్‌ నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్‌ సూచించారు. తొమ్మిదేళ్లలో నగరం ఎలా మారిందో ప్రజలు చూస్తున్నారన్నా రు. 1976లో తాను ఇక్కడి మిషన్‌ హాస్పిటల్‌లో జ న్మించానని, కరీంనగర్‌, ఎల్‌ఎండీలో మూడునా లుగేళ్లు చదివానని గుర్తు చేశారు. నగరంలో పర్యటించినప్పుడు అంతర్గత రోడ్లు చూశానని, చాలా బాగున్నాయని అభినందించారు. రూ.225 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని, రూ.480 కోట్లతో నిర్మిస్తున్న రివర్‌ఫ్రంట్‌ పనులు వేగంగా జ రుగుతున్నాయని వెల్లడించారు. మూడు నాలుగు నెలల్లో రివర్‌ఫ్రంట్‌ పూర్తయ్యాక ప్రజలు ఆశ్చర్యపోయే స్థాయికి కరీంనగర్‌ చేరుతుందన్నారు.

వచ్చే సెప్టెంబర్‌ నాటికి హౌసింగ్‌బోర్డుకాలనీలో 24 గంటల నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం ఏర్పాటు చేసుకున్న తొలినగరం కరీంనగర్‌ అని తెలిపారు. కౌన్సి ల్‌ హాల్‌ అసెంబ్లీ హాల్‌లాగా ఉందని ప్రశంసించా రు. టీవీల్లో కనిపించాలన్న ఆత్రంతో కొందరు కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు దిగజారి దూషణలకు దిగుతున్నారని, అందుకే కౌన్సిల్‌ మీటింగ్‌కు మీడియాను అనుమతించొద్దన్నానని స్పష్టంచేశారు.

లైటింగ్‌ కోసం రూ.20 కోట్లు
సాయంత్రం మానేరు తీరాన తీగల వంతెన ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. తీగల వంతెన నుంచి మానకొండూరు వరకు లైటింగ్‌ కోసం మంత్రి గంగుల కమలాకర్‌ తనను కోరారని, వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. రెండు నెలల్లో మానేరు రివర్‌ ఫ్రంట్‌ తొలిదశ పూర్తవుతుందన్నారు. శ్రీవేంకటేశ్వర ఆలయం, మెడికల్‌ కాలేజీలతో జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు.

వచ్చే దసరా నాటికి రివర్‌ఫ్రంట్‌పై నగర ఆడపడుచులు బతుకమ్మ ఆడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను లండన్‌లా మారుస్తానన్న సీఎం కేసీఆర్‌ తన మాటలను నిజం చేసి చూపించారన్నారు. వచ్చేవారం సింగపూర్‌, సియోల్‌ నగరాలకు వెళ్లి పర్యటించి నగరానికి కావాల్సిన సదుపాయాలపై మంత్రి కేటీఆర్‌కు నివేదిక ఇస్తామని వెల్లడించారు. తీగల వంతెన ఆలోచనకు కారణమైన ఈఎన్‌సీ రవీందర్‌రావును ప్రశంసించారు.

ప్రైవేట్‌ రంగాల్లోనూ రాణించొచ్చు
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్‌ రంగంలోనూ రాణించొచ్చని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రూ.7 కో ట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న మోడ్రన్‌ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. లైబ్రరీలో ఉన్న వి ద్యార్థులతో మాట్లాడారు. ఇక్కడున్న వస్తువు భారతీయులది కాదని, విదేశీయుల వస్తువులు వాడే దుస్థితి మనకు ఉండొద్దని సూచించారు. ఉద్యోగాలు రాలేదని బాధపడొద్దని, మనమే ప్రపంచానికి కొత్త వస్తువులను అందించే స్థాయికి ఎదగాలని సూచించారు.

భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా కష్టపడి చదవాలని, ప్రైవేట్‌ వ్యాపార రంగాలపైనా దృష్టి సారించాలన్నారు. గ్రంథాలయ ఐడీ కార్డును కేటీఆర్‌కు అందించారు. కార్యక్రమాల్లో మండలి విప్‌ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రశిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ పర్యటన సాగిందిలా..
రూ.10 కోట్లతో నిర్మించనున్న కాశ్మీర్‌గడ్డ సమీకృత మార్కెట్‌, రూ.7కోట్లతో నిర్మించనున్న మోడ్రన్‌ లైబ్రరీ, నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌, నూతన సమావేశ మందిరం, ఆధునీకరించిన సమావేశమందిరం, కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంను ప్రారంభించారు. కమాండ్‌ కంట్రోల్‌ గురించి వివరాలు తెలుసుకున్నారు. నూతన కౌన్సిల్‌ హాల్‌లో మేయర్‌ యాదగిరి సునీల్‌రావును సీటులో కూర్చొబెట్టి అభినందించారు.

హాజరైన అధికారులు, ప్రముఖులు1
1/3

హాజరైన అధికారులు, ప్రముఖులు

యువత కేరింతలు2
2/3

యువత కేరింతలు

ఆకట్టుకున్న కళాకారిణి నృత్య ప్రదర్శన3
3/3

ఆకట్టుకున్న కళాకారిణి నృత్య ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement