గ్రామస్తుల పోరాటానికి బీజేపీ మద్దతు

మాట్లాడుతున్న బండి సంజయ్‌ - Sakshi

ఇథనాల్‌ పరిశ్రమ రద్దు చేసేవరకూ ఉద్యమం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

వెల్గటూర్‌(ధర్మపురి): ఇథనాల్‌ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతుగా తెలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేటలో జరిగే బహిరంగ సభకు వెళ్తూ మార్గమధ్యంలోని వెల్గటూర్‌ మండలం పాశిగామ స్టేజీ వద్ద ఆగారు. పాశిగామ, స్తంభంపల్లి గ్రామస్తులు ఆయనతోపాటు పార్టీ నాయకుడు వివేక్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నా..

ఎక్కడా జనావాసాల మధ్య ఏర్పాటు చేయబోమన్నారు. మంత్రి అబద్ధపు ప్రచారాలతో గ్రామస్తులను మో సం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అవసరమైతే మరోసారి వచ్చి అందరినీ కలుస్తానని అన్నారు.

బండి సంజయ్‌కి సన్మానం
ధర్మపురి:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బుధవారం జరిగే బహిరంగ సభకు వెళ్తున్న ఆయనను రాయపట్నం జాతీయ రహదారి వద్ద బీజేపీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నాయకుడు లవన్‌కుమార్‌ తదితరులు కలిసి స్వాగతం పలికారు. బండి సంజయ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top