ఇద్దరు పిల్లల తండ్రి.. ప్రియురాలి తల్లితో జంప్‌! | Young Man Elopes With Lover Mother In London | Sakshi
Sakshi News home page

ప్రియురాలి తల్లితో ప్రేమ.. బ్రేకప్‌ చెప్పి జంప్‌!

Feb 18 2021 3:52 PM | Updated on Feb 18 2021 5:06 PM

Young Man Elopes With Lover Mother In London - Sakshi

జెస్‌,రియాన్‌ల జంట.. జార్జినా,రియాన్‌, జెస్‌

కొన్ని గంటల తర్వాత జెస్‌నుంచి ఆమెకో మెసేజ్‌ వచ్చింది. తమ ప్రేమను....

లండన్‌ : తన బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలిని కాదని ఆమె తల్లితో పారిపోయాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్లౌస్‌స్టర్‌షైన్‌కు చెందిన జెస్‌ అల్‌డ్రిడ్జ్‌ (24), అదే ప్రాంతానికి చెందిన రియాన్‌ షెల్టన్‌ (29)తో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. రియాన్‌తో పాటు ఆమె తల్లి 44 ఏళ్ల జార్జినాతోనూ సైడ్‌ ట్రాక్‌ నడిపాడు. రాత్రిళ్లు కిచెన్‌లో బకార్డి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. వీరి ప్రవర్తన రియాన్‌కు అనుమానాస్పదంగా తోచింది. దీంతో ఓ రోజు దీనిపై ఇద్దర్నీ నిలదీయగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు. రియాన్‌ కడుపుతో ఉన్న సమయంలో జెస్‌,జార్జినాలు రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం రియాన్‌కు తెలిసినా ఏమీ చేయలేకపోయింది. ( అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య)

జనవరి 28న జెస్‌,రియాన్‌ల ప్రేమకు గుర్తుగా పండంటి మొగబిడ్డ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొన్ని గంటల తర్వాత జెస్‌నుంచి ఆమెకో మెసేజ్‌ వచ్చింది. తమ ప్రేమకు బ్రేకప్‌ చెబుతున్నట్లు. ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన ఆమెకు.. జెస్‌, జార్జినా లేచిపోయారన్న విషయం తెలిసి షాక్‌ అయింది. దీనిపై రియాన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇది దారుణమైన వెన్నుపోటు. ఏ అమ్మమ్మ అయినా మనవడితో ప్రేమలో పడాలి.. మనవడి తండ్రితో కాదు. నాకు, నా పిల్లలకు తోడుగా ఉంటుందనుకున్నాను. కానీ, ఇలా నా ప్రియుడితో పారిపోతుందనుకోలేదు’’అని కన్నీటి పర్యంతం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement