‘బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు

A Young Football Fan carries 48 Beers At Once Than He Become Cult Hero - Sakshi

నెదర్లాండ్స్‌: మనం మన చేతుతలతో వాటర్‌ గ్లాస్‌లని ఒకేసారి రెండూ, మూడో మహా అయితే నాలుగు కూడా పట్టుకోవచ్చు. ఇంకా మరింత ప్రయత్నం చేసి ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కవ గాజు గ్లాస్‌లతో వాటర్‌ లేదా కూల్‌ డ్రింక్‌ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్‌ గ్లాస్‌లను తీసుకొచ్చేశాడు.

(చదవండి: అక్టోబర్‌ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం)

నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్‌గెరింగ్ ఫుట్‌బాట్‌ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాట్‌ స్టేడియంలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్‌ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం.

కానీ  క్రిస్టియాన్ ఓకేసారి ఐదు ట్రైలో బీరుగ్లాస్‌లను ఒకదానిపై ఒకటి పెట్టి మొత్తం 48 గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న స్టేడియంలోని ప్రేక్షక్షుల అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతను ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్‌ పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్‌ వావ్‌ యు ఆర్‌ సో గ్రేట్‌ అంటూ రకరకాలు ట్వీట్‌ చేశారు.

(చదవండి:  అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్‌ కాపాడండి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top