ప్రస్తుతం హర్ముజ్ విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. అమెరికా, ఇరాన్ రెండు దేశాలు పట్టు వదలకుండా భీష్మించుకొని కూర్చువడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. హర్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించాలని ఇరు దేశాలు యుద్ధాన్ని వీడి శాంతి బాట పట్టాలని హితవు పలికారు.
ప్రస్తుతం యుద్ధం విషయంలో చైనాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూఎస్‌ఏ నిఘా ఏజెన్సీలు ఇరాన్‌కు చైనా ఆయుధాల తరలింపు చేస్తోందని సమాచారం అందించాయి. వాటిలోనూ మ్యాన్‌పాడ్ (భుజంపై మోసుకెళ్లగలిగే ఆయుధాలు) తరలింపు చేపడుతుందని వీటితోనే అమెరికా క్షిపణులపై ఇరాన్ దాడి చేయగలిగిందని పేర్కొన్నాయి. అయితే దీనిని చైనా ఖండించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా హర్ముజ్ విషయంలో స్పందించారు.
ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి కోసం వివాదాలను, రాజకీయ మరియు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తక్షణమే సమగ్ర కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్ కోరినట్లు బీజింగ్ కథనాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అంతర్జాతీయ సమాజంతో పాటు ఎంతో ప్రయోజనకరమని కోరినట్లు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో జిన్‌పింగ్ మధ్యప్రాచ్య కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని జిన్‌పింగ్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో పరోక్షంగా భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే సూచించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు స్పందించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును (LNG) దిగుమతి చేసుకునే చైనాకు ఈ జలసంధి అత్యంత కీలకం.
హర్ముజ్ చైనాకు కీలకం
అయితే ప్రపంచంలోనే చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. తన చమురుఅవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతులు ద్వారానే సమకూర్చుకుంటుంది. దిగుమతుల్లో రష్యా తొలిస్థానంలో ఉండగా తదుపరి సౌదీ అరేబియా ఉంది. అయితే యుద్ధం కారణంగా మార్చి నెలలో ఆ ప్రాంతానికి చైనా ఎగుమతులు 43 శాతం పడిపోయాయని కథనాలు పేర్కొన్నాయి.


