Aliens:మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!

World War Can Starts With Aliens Due To Disable Of Nuclear Weapons - Sakshi

ఏలియన్స్‌ అణు క్షిపణులను ట్యాంపరింగ్‌ చేయడమే కాక నిర్వీర్యం కూడా చేసేస్తున్నాయట

న్యూయార్క్‌: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు  చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్‌ మిలటరీ ఆఫీసర్‌ రాబర్ట్‌ సలాస్‌  అంటున్నారు. 

(చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్‌​ కాంప్లెక్స్‌)

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్‌ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. 

ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్‌ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసిన‍ట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్‌ అన్నారు.  

సలాస్‌ యూఎస్‌  ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్‌ వెపన్‌ కం‍ట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్,  రాక్‌వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు.

(చదవండి: ఆ కెమికల్‌ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top