ఆ కెమికల్‌ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి

Study Says Widely Used Chemical Linked US Deaths Per Year - Sakshi

న్యూయార్క్‌: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్‌ పరికరాలన్నింటిలో థాలెట్‌ ఆనే కెమికల్‌ ఉన్నట్లు న్యూయార్క్‌ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే  దుస్తులు, షాంపు నుంచి మేకప్‌ వరకు అన్ని ప్లాస్టిక్‌తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్‌ అనే కెమికల్‌ ఉత్పన్నవతోందని వెల్లడించారు. 

(చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్‌ డాలర్లు!)

ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్‌ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు.

న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్‌ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్‌ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్‌ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్‌ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్‌ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు.

(చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top