ఖలీద్‌ మషాల్‌ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? | Who is Khaled Mashal, Kerala Rally Sparks Controversy | Sakshi
Sakshi News home page

Khaled Mashal: ఖలీద్‌ మషాల్‌ ఎవరు?

Oct 31 2023 9:07 AM | Updated on Oct 31 2023 9:49 AM

Who is Khaled Mashal Kerala Rally Sparks Controversy - Sakshi

కేరళలోని మలప్పురంలో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు ఖలీద్ మషాల్ వర్చువల్‌ ఉనికి ఆందోళనకరంగా మారింది. హమాస్ నాయకుడు ర్యాలీలో కనిపించడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.  భారతదేశంలో నిర్వహించే ర్యాలీలో ప్రసంగించేందుకు ఉగ్రవాద సంస్థ నాయకునికి ఎలా అనుమతినిస్తారని పోలీసులను బిజేపీ ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో కేరళలో పాలస్తీనా అనుకూల ర్యాలీలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ర్యాలీలో ఖలీద్ మషాల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ర్యాలీని జమాత్-ఇస్లామీ యువజన విభాగం సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ నిర్వహించింది. 

ఖలీద్ మషాల్ హమాస్ పొలిట్‌బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించాడు. చాలాకాలం పాటు ఖలీద్ మషాల్ హమాస్ నాయకుడిగా ఉన్నారు. ఖలీద్ మషాల్ వెస్ట్ బ్యాంక్‌లో జన్మించాడు. కువైట్, జోర్డాన్‌లో పెరిగాడు. 2004లో ప్రవాస హమాస్‌కు రాజకీయ నాయకునిగా మారాడు. ఖలీద్ మషాల్ ఎప్పుడూ గాజాలో నివసించలేదు. జోర్డాన్, సిరియా, ఖతార్, ఈజిప్టులో ఉంటూ గాజా కోసం వ్యూహాలు రచించేవాడు.

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఖలీద్ మషాల్ ప్రస్తుతం ఖతార్‌లో ఉన్నాడు. అతని నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లు. కేరళలో జరిగిన ర్యాలీలో వర్చువల్‌గా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. అందులో బుల్డోజర్, హిందుత్వాన్ని నిర్మూలించండి.. వర్ణవివక్ష-జియోనిజం లాంటి నినాదాలు కనిపించాయి.

సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు సుహైబ్  మీడియాతో మాట్లాడుతూ హమాస్ భారతదేశానికి సంబంధించిన సంస్థ కాదని, చట్ట ప్రకారం వారి భాగస్వామ్యం నేరం కాదన్నారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఖలీద్ మషాల్ పాల్గొన్నారని, ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదన్నారు.
ఇది కూడా చదవండి: అ‍ప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement