Sakshi News home page

ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్

Published Sat, Aug 19 2023 10:51 AM

WHO Chief Praises Indias Ayushman Bharat Scheme - Sakshi

గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు.

జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. 

నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 

కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. 

ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి  సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.      

ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి..

Advertisement

What’s your opinion

Advertisement