పశ్చిమాసియా రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అదే.. ఇరాక్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇప్పుడు పరిస్థితులు అంతకంటే పెద్ద సంక్షోభానికి తెరలేస్తుందా అన్నట్లుగా తయారవుతున్నాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించిన 'వార్ ఆన్ టెర్రర్' (War on Terror).. పాతికేళ్ల తర్వాత ఇప్పుడు అధికారికంగా ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇరాక్ గడ్డపై మిగిలి ఉన్న చివరి అమెరికన్ బలగాలు కూడా పూర్తిగా వెనక్కి వచ్చేశాయి.
ఇరాక్ ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ఆ కొన్ని వందల మంది సైనికులు సైతం తమ సైనిక సామగ్రితో స్వదేశానికి పయనమయ్యారు. పైకి చూస్తే ఇది ఒక యుద్ధం ముగింపులా కనిపించవచ్చు. కానీ, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల మాటల్లో మాత్రం అమెరికా నిష్క్రమణ అనేది శాంతికి ఆరంభం కాదని, అగ్నిపర్వతం బద్ధలవ్వడానికి సంకేతమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇరాక్ అనేది ఒక సహజమైన దేశమా? లేక వలస పాలకులు బలవంతంగా నిర్మించిన రాజ్యమా? అమెరికా ఔట్ అయ్యాక.. ఇరాక్లో ఏం జరగబోతోంది..? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి..


