భారత్‌పై ఇజ్రాయెల్‌ ప్రధాని కీలక వాఖ్యలు | We Have Some Other Friends Like India: Netanyahu | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఇజ్రాయెల్‌ ప్రధాని కీలక వాఖ్యలు

Jul 6 2026 6:58 AM | Updated on Jul 6 2026 1:03 PM

We Have Some Other Friends Like India: Netanyahu

ఇజ్రాయెల్‌కు అమెరికా మాత్రమే ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అంటూ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్  చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తోసిపుచ్చారు. అమెరికాకు ఆవల కూడా భారత్‌ సహా ఇతర దేశాల మద్దతు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్‌-అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం.. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

వాన్స్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందిస్తూ.. తమకు అనేక దేశాల అండ ఉందని.. వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా ఉందన్నారు.  అక్కడ 140 కోట్ల జనాభా ఉంది. అక్కడ మాకు ఎంతటి అపారమైన మద్దతు ఉందో తెలుసా" అంటూ ఆయయన వ్యాఖ్యానించారు. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాన్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. ఆయనకు నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవిస్తానని కాదు. అలాగే వైట్‌హౌస్‌లో తమకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడని.. తాను భావించే ప్రెసిడెంట్ ట్రంప్‌కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

నెలల తరబడి సాగుతున్న ఘర్షణలను ముగించడానికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి విస్తృత ప్రాంతీయ చర్చలు కోసమే ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని రూపొందించినట్లు వాన్స్ సమర్థించుకున్నారు. వాషింగ్టన్ అందిస్తున్న సైనిక మద్దతును ఇజ్రాయెల్ నాయకులకు గుర్తు చేస్తూ, ఇజ్రాయెల్ రక్షణ ఆయుధాలలో మూడింట రెండు వంతులు అమెరికా తయారు చేసిందని వాన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు సమస్య ట్రంప్ కాదు. అమెరికా అధ్యక్షుడే తమ పెద్ద సమస్య అని ఇజ్రాయెల్‌లో ఎవరైనా భావిస్తే.. వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలి" అంటూ వాన్స్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement