ఏమిటి ఈ మాయ‌.. ఎలా సాధ్యం | Watch Amazing Video Of Man Spins 5 Footballs At Single Time | Sakshi
Sakshi News home page

ఏమిటి ఈ మాయ‌.. ఎలా సాధ్యం

Sep 9 2020 7:48 PM | Updated on Sep 9 2020 8:04 PM

Watch Amazing Video Of Man Spins 5 Footballs At Single Time - Sakshi

మ‌నం సాధార‌ణంగా ఒక ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్‌‌ను చేతివేలిపై పెట్టుకొని స్పిన్నింగ్ చేయ‌డం త‌ర‌చుగా చూస్తేనే ఉంటాం. ఒక్కోసారి మ‌నం చేసే ఈ ప్ర‌య‌త్నం బెడిసి కొట్టే అవ‌కాశం కూడా ఉంటుంది. కానీ చేతుల‌ను ఉప‌యోగించ‌కుండా ఒకేసారి ఐదు బంతుల‌ను స్పిన్ చేయ‌డం ఎప్పుడైనా చూశారా ? అదేంటి ఒకేసారి ఐదుబాల్స్ స్పిన్ చేయ‌డం అసాధ్యం అని అంటున్నారా.. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే వీడియోలో ఒక వ్య‌క్తి ఒకేసారి ఐదు బంతుల‌ను స్పిన్ చేసి ఔరా అనిపించాడు. (చదవండి : వారెవ్వా.. వాట్‌ ఏ డ్రైవింగ్‌ స్కిల్స్)

అస‌లు విష‌యానికి వెళ్తే.. ముందుగా వీడియోలో ఒక‌ యువ‌కుడు సోఫా మీద ప‌డుకొని సెల్‌ఫోన్‌ను చేతుల‌తో ఆప‌రేట్ చేస్తూ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఒక ఫుట్‌బాల్‌ను నోటి ద‌గ్గ‌ర‌,  రెండు ఫుట్‌బాల్స్‌ను మోకాళ్ల వ‌ద్ద‌, మ‌రో రెండు ఫుట్‌బాల్స్‌ను పాదాల వద్ద ఉంచి ఎలాంటి క‌ద‌లిక‌లు లేకుండానే అవి గిర్రుమ‌ని తిరుగుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. అస‌లు ఇదెలా సాధ్యం అనే అనుమానం కూడా వ‌స్తుంది. ఇలా చేయ‌డానికి ఏదైనా ట్రిక్ ఉప‌యోగించినా.. మ‌న క‌ళ్ల‌ను మాయ చేయ‌డంలో నైపుణ్యం చూపించాడు.. అందుకు అత‌నికి సెల్యూట్ చేసి తీరాల్సిందే.

కొంచెం క‌న్య్ఫూజ‌న్ మోడ్‌లో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏమిటి ఈ మాయ.. ఎలా సాధ్యం.. మ‌న‌కు తెలియ‌కుండా ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడేమో.. ఇలాంటివి చేయాలంటే ఎంతో నైపుణ్యం క‌లిగి ఉండాలి.. నీ శ‌రీరంలో ఏమైనా మిష‌న్లు దాచావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 7 ల‌క్ష‌ల‌కు పైగా వీక్షించారు. 

Advertisement
 
Advertisement
Advertisement