breaking news
spinning
-
ఏమిటి ఈ మాయ.. ఎలా సాధ్యం
మనం సాధారణంగా ఒక ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్‌ను చేతివేలిపై పెట్టుకొని స్పిన్నింగ్ చేయడం తరచుగా చూస్తేనే ఉంటాం. ఒక్కోసారి మనం చేసే ఈ ప్రయత్నం బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ చేతులను ఉపయోగించకుండా ఒకేసారి ఐదు బంతులను స్పిన్ చేయడం ఎప్పుడైనా చూశారా ? అదేంటి ఒకేసారి ఐదుబాల్స్ స్పిన్ చేయడం అసాధ్యం అని అంటున్నారా.. అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి ఐదు బంతులను స్పిన్ చేసి ఔరా అనిపించాడు. (చదవండి : వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్) అసలు విషయానికి వెళ్తే.. ముందుగా వీడియోలో ఒక యువకుడు సోఫా మీద పడుకొని సెల్‌ఫోన్‌ను చేతులతో ఆపరేట్ చేస్తూ పనిలో నిమగ్నమయ్యాడు. ఒక ఫుట్‌బాల్‌ను నోటి దగ్గర, రెండు ఫుట్‌బాల్స్‌ను మోకాళ్ల వద్ద, మరో రెండు ఫుట్‌బాల్స్‌ను పాదాల వద్ద ఉంచి ఎలాంటి కదలికలు లేకుండానే అవి గిర్రుమని తిరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఇదెలా సాధ్యం అనే అనుమానం కూడా వస్తుంది. ఇలా చేయడానికి ఏదైనా ట్రిక్ ఉపయోగించినా.. మన కళ్లను మాయ చేయడంలో నైపుణ్యం చూపించాడు.. అందుకు అతనికి సెల్యూట్ చేసి తీరాల్సిందే. కొంచెం కన్య్ఫూజన్ మోడ్‌లో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏమిటి ఈ మాయ.. ఎలా సాధ్యం.. మనకు తెలియకుండా ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడేమో.. ఇలాంటివి చేయాలంటే ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి.. నీ శరీరంలో ఏమైనా మిషన్లు దాచావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram All-star status, no hands required. ⭐️ 🙌 Kick off your week with a collection of things that will make you smile, right now on our story. Reel by @ryutricks A post shared by Instagram (@instagram) on Sep 7, 2020 at 12:23pm PDT -
సాలెగూడు కట్టే తీరు చూస్తే ఔరా అనాల్సిందే!
-
''స్కూళ్ళు.. డబ్బు ఒడికే యంత్రాలు''
ముంబైః పాఠశాలలు పిల్లలనుంచీ డబ్బును ఒడికే యంత్రాలుగా మారిపోతున్నాయంటూ ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ విద్యార్థిని అకారణంగా స్కూల్ నుంచి బయటకు పంపిన కారణంగా దక్షిణ ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. అడిగిన ఫీజు కట్టినతర్వాత కూడా... పుస్తకాలు, యూనిఫాం అంటూ మరో 50 వేలు కట్టాలని స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసినట్లు విద్యార్థి తండ్రి కోర్టుకు ఓ లేఖద్వారా విన్నవించాడు. దీంతో విచారించిన ముంబై హైకోర్టు సదరు స్కూలుకు నోటీసులు పంపించింది. ఇటీవల స్కూలు యాజమాన్యాలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, డబ్బు ఒడికే యంత్రాలుగా మారుతున్నాయని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫీజు మొత్తం కట్టిన తర్వాత కూడా.. విద్యార్థినుంచి మరో 50 వేల రూపాయలు డిమాండ్ చేయడంతోపాటు, నిర్దాక్షిణ్యంగా విద్యార్థిని స్కూలునుంచి బయటకు పంపించిన విషయంలో దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ హెచ్ వి బి గ్లోబల్ అకాడమీ స్కూల్ కు నోటీసులు జారీ చేసింది. స్కూల్లో చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్థి కి జరిగిన అన్యాయంపై బాలుడి తండ్రి రాసిన లేఖను జస్టిస్ వీఎం కనాడే, ఎమ్ ఎస్ సోనాక్ డివిజన్ బెంచ్ విచారించింది. ఏడవ తరగతిలో చేర్పించేందుకుగానూ పాఠశాల యాజమాన్యం ముందుగా కోరినట్లుగానే 1,09,500 రూపాయలను కట్టామని, అందుకు యాజమాన్యం రసీదు కూడ ఇచ్చిందని, అనంతరం యూనిఫాంలు, స్టేషనరీ పేరుతో 50 వేల రూపాయలు అదనంగా కట్టాలంటూ డిమాండ్ చేయడంతో తాము వ్యతిరేకించినందుకు గాను తమ కుమారుడ్ని పాఠశాలనుంచి బలవంతంగా టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) ఇచ్చి బయటకు పంపించేశారంటూ విద్యార్థి తండ్రి సంతోష్ మెహతా కోర్టుకు ఇచ్చిన లేఖలో వివరించాడు. అంతేకాక తమ కుటుంబాన్ని కూడా స్కూలు సిబ్బంది వేధింపులకు గురి చేసినట్లు మెహతా లేఖలో పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ఫిబ్రవరి నెల్లోనే విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కు, ఛైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశానని, అప్పట్లో విద్యార్థిని స్కూల్లోకి అనుమతించమంటూ విద్యాశాఖ డైరెక్టర్ స్కూలు యాజమాన్యానికి సూచించారని చెప్పారు. అనంతరం తమ కుమారుడు స్కూలుకు వెళ్ళగా సెక్యూరిటీ సిబ్బంది లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని, దాంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు మెహతా తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా సదరు స్కూలుకు నోటీసులు పంపించి, జూలై 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.