నో డౌట్‌! రష్యా గెలుపు పక్కా!: పుతిన్‌ | Vladimir Putin Said Moscow Victory In Ukraine Guarantee | Sakshi
Sakshi News home page

నో డౌట్‌! రష్యా గెలుపు పక్కా!: పుతిన్‌

Published Wed, Jan 18 2023 8:37 PM | Last Updated on Wed, Jan 18 2023 9:25 PM

 Vladimir Putin Said Moscow Victory In Ukraine Guarantee - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్‌ తాము కచ్చితంగా ఉక్రెయిన్‌పై విజయం సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమాగా చెప్పారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ రష్యా దళాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చెప్పారు. లెనిన్‌గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరాన్ని పుతిన్‌ సందర్శించారు. 

ఈ నేపథ్యంలోనే పుతిన్‌ అక్కడ ఒక కర్మాగంలో కార్మికులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా కచ్చితంగా తమకు గెలుపును తెచ్చిపడతాయని విశ్వాసంగా చెప్పారు. అంతేగాదు పుతిన్‌ క్షిపణి తయారుదారు అల్మాజ్‌ ఆంటెలో భాగమైన ప్లాంట్‌లో ప్రసంగిస్తూ రష్యా రక్షణ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇటీవలే ఉక్రెయిన్‌లో రష్యా టాప్‌ కమాండర్‌ని నియమించిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదీగాక రష్యా ప్రత్యేక 'సైనిక ఆపరేషన్‌' పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ దాడికి దిగి సరిగ్గా ఏడాది కావస్తున్న తరుణంలో రష్యాలో ఒకింత భయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సమర్థింపు చర్యగా పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. 

(చదవండి:  ఉక్రెయిన్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. మంత్రితో సహా 16 మంది దుర్మరణం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement