జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్‌ షేర్‌ చేయడంతో పరార్‌!!

A viral video For Personal trainer Appreciate for creepy guy's constant staring Her Give A Strong Response - Sakshi

కొన్ని సంఘటనలు చూస్తే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా మహిళలు పనులను స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఇబ్బందిపడకుండా చేసుకునే అవకాశం మాత్రం ఎప్పటికీ కుదరదేమో అనిపిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ ఒకటి జరిగింది.

(చదవండి: యూకే లివర్‌పూల్‌ నగంలో కారు బ్లాస్ట్‌... ఒకరు మృతి)

సాధారణంగా జిమ్‌ సెంటర్‌లలో అందరూ ఒకేసారి తమ వర్క్‌ అవుట్‌లను చేసుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడొక మహిళ అలానే తాను తన వర్కవుట్‌లు కొనసాగిస్తుండగా ఒక సీనియర్‌ సిటిజన్‌ తనను తదేకంగా చూస్తుంటాడు. దీంతో ఆమె అసౌకర్యంగా ఫీలై ఆమె తన భర్తను తన పక్కన నిలబడమని చెబుతుంది. అయితే ఆమె భర్త తన పక్కన నిలబడి ఉ‍న్నప్పటికీ సదరు వ్యక్తి మళ్లీ అలానే చూస్తుంటాడు. దీంతో ఆమె తన ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఆ ఘటనను చిత్రికరించి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేస్తుంది.

పైగా ఆ విషయాన్ని అతనికి చెప్పడంతో సదరు వ్యక్తి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతేకాదు ఆ విషయాన్ని గమనిస్తున్న జిమ్‌ ట్రైనర్‌ ఆమె చేసిన పనికి ప్రశంసిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె చేసిన పనికి ప్రశంసలు వర్షం కురిపించడమే కాక మంచి పనిచేశారంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’ వివాదం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top