టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్‌చల్‌

Viral Video Of City Terrorized By Goat Sheep And Three Lambs In Turkey - Sakshi

ఇస్తాంబుల్‌ : టర్కీలో నెవ్‌షేహిర్‌ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ప్రజలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఒక గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. రోడ్డుపై ఉన్నవారిని భయపెట్టే విధంగా చర్యలకు పూనుకుంది. మనుషుల మీదకు పరిగెత్తడం.. తమకు అడ్డు వచ్చినవారిపై బౌతికదాడికి దిగడం చేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇదంతా ఎవరైనా గుర్తు తెలియని అగంతకులు చేశారనుకుంటే మాత్రం పొరబడ్డట్టే.

మరీ రోడ్డుపై హల్‌చల్‌ చేసిన ఆ గ్యాంగ్‌ ఎవరో తెలుసా.. ఒక గొర్రె, మేక, మరో మూడు గొర్రె పిల్లలు. అవును మీరు విన్నది నిజం.. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ.. ఆ గుంపుకు గొర్రె నాయకత్వం వహించగా.. మేక, గొర్రె పిల్లలు దానిని అనుసరించాయి. వీటి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను పరుగులు పెట్టించాయి. వాటిని ఆపుదామని భావించినకొందరిని తమ తలలో గుద్దడానికి ప్రయత్నించి నానా హంగామా చేశాయి. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులవుతుంది. దీనిని వీడియో తీసిన నెవ్‌షెహిర్‌ మున్సిపాలిటీ అధికారులు ట్విటర్‌లో షేర్‌ చేసింది. షేర్‌ చేసిన కాసేపటికే 2.7 మిలియన్‌ వ్యూస్‌ రాగా.. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. (చదవండి : సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌లో..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top