చైనా రాయ‌బారికి వినూత్న స్వాగ‌తం

Viral Photo: Chinese Ambassador Walk Across Backs Of Locals In Kiribati - Sakshi

టరావా: కిరిబాటి ద్వీపంలో చైనా రాయ‌బారికి ఆహ్వానం ప‌లికిన తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కిరిబాటిలో చైనా రాయ‌బారిగా విధులు నిర్వ‌ర్తించ‌డానికి వెళ్లిన‌‌ టాంగ్ సాంగ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు అక్క‌డ అన్నిర‌కాల ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా అధికారి విమానం నుంచి దిగ‌గానే దారి పొడ‌వునా స్థానిక‌ యువ‌కులు నేల‌పై బోర్లా ప‌డుకున్నారు. అనంత‌రం వీళ్ల వీపుల‌పై చైనా రాయ‌బారి న‌డుచుకుంటూ ముందుకు వెళ్లారు. సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించిన ఇద్ద‌రు మ‌హిళ‌లు ఆయ‌న‌ను చెరో చేయి ప‌ట్టుకుని న‌డిపించారు. ఈ నెల‌లోనే జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఈ ఘ‌ట‌న‌పై కొంద‌రు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. అయితే కిరిబాటి అధికారులు మాత్రం ఇందులో త‌ప్పేం లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌ద్ధ‌తిలో అతిథుల‌ను ఆహ్వానించ‌డం త‌మ సాంప్ర‌దాయ‌మ‌ని వెల్ల‌డించారు. తొలిసారి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కానీ, పెళ్లిళ్ల స‌మ‌యంలో కానీ ఇలానే స్వాగ‌తం ప‌లుకుతామ‌ని అద్లి జ్టుహుక్స్ అనే నెటిజ‌న్ పేర్కొన్నారు. (సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!)

చ‌ద‌వండి: వామ్మో.. చై'నో'..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top