Helicopter Spins: ఆకాశంలో 175 సార్లు రివవర్స్‌ స్పిన్నింగ్‌.. తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకొని

Viral: Man Breaks His Own Guinness World Record Of 175 Helicopter Spins - Sakshi

స్కై డైవింగ్‌ అంటేనే సాహసం. కొద్దిసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆ తరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే వచ్చే థ్రిల్‌ అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ హెలికాప్టర్‌ స్పిన్స్‌ కొట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు యూఎస్‌కు చెందిన ఓ స్కై సర్ఫర్‌.

నేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్‌లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్‌... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్‌ తిరిగిన కీత్‌ కెబె రికార్డు బ్రేక్‌ చేశాడు.

వర్జీనియాలోని ఆరెంజ్‌ కౌంటీలో హెలికాప్టర్‌ నుంచి దూకి స్పిన్స్‌ చేస్తున్న కెబె వీడియోను గిన్నిస్‌ ఇటీవల విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 4న ఈ ఫీట్‌ చేసిన కెబె..  2021 ఈజిప్ట్‌లోని గిజాలోనూ ఇలాంటి స్పిన్సే చేశాడు. కాకపోతే అప్పుడు సింగిల్‌ జంప్‌లో 165 స్పిన్స్‌ చేశాడు. ఇప్పుడు మరో పది యాడ్‌ చేసి.. సింగిల్‌ జంప్‌లో 175 సార్లు తిరిగి తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడన్నమాట.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top