‘ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడు.. త్వరలోనే బయటకు వస్తాడు!’

Velupillai Prabhakaran Says Tamil Leader pazha nedumaran - Sakshi

త‌మిళుల ఆరాధ్యదైవం, ఎల్‌టీటీఈ చీఫ్‌ వేలుపిళ్లై ప్రభాకరన్‌ బతికే ఉన్నాడా?.. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నేత చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోమవారం తంజావూరులో  పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత  కింది సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తమిళ జాతీయవాది, కాంగ్రెస్‌ మాజీ నేత అయితే పళ నెడుమారన్‌ తాజాగా.. ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడంటూ ప్రకటించారు. తమిళ ప్రజల కోసం లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఇలం(ఎల్‌టీటీఈ) నేత త్వరలోనే వస్తాడంటూ ఉలగ తమిళర్‌ పెరమైప్పూ నేత తమిళ నెడుమారన్‌ ప్రకటించడం గమనార్హం. ప్రపంచంలో ఉన్న తమిళులందరికీ శుభవార్త. ఆయన బతికే ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి నేపథ్యంలో .. తమిళ దేశీయ తలైవర్‌(తమిళ జాతీయ వాద నేత) ప్రభాకరన్‌ బయటకు రావాల్సిన అవసరం వచ్చిందని, తాను జీవించి లేనన్న పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందంటూ నెడుమారన్‌ వ్యాఖ్యానించారు. తమిళుల అభ్యున్నతి కోసం ప్రభాకరన్‌ ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చిందని, ఆయనకు తమిళనాడులోని రాజకీయపార్టీలు.. ప్రపంచంలోని ప్రజలు సంపూర్ణ మద్ధతు ప్రకటించాలని వ్యాఖ్యానించారాయన. 

అయితే.. అయితే ప్రభాకర్‌ బతికే ఉన్నాడనేందుకు ఆధారాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన దాటవేత ప్రదర్శించారు. అయితే.. తాము ఇప్పటికీ టచ్‌లో ఉన్నామని, ఈ సమయంలో అంతకు మించి ఇంకేం చెప్పలేమంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమం ప్రారంభించిన ప్రభాకరన్‌.. 2009 మే 18వ తేదీన ముల్లైవైతూ జిల్లా ముల్లైవైక్కల్‌ వద్ద  శ్రీలంక బలగాల చేతుల్లో మరణించినట్లు ప్రకటన వెలువడింది. ప్రభాకరన్‌ చనిపోయాడంటూ సాక్ష్యంగా ఒక వీడియో, కొన్ని ఫొటోలను సైతం రిలీజ్‌ చేసింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top