వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది..ఫోటోషూట్‌ చేసి మరీ..

US Woman Celebrates Her Divorce By Burning Her Wedding Dress - Sakshi

డైవర్స్‌ అన్న పదం వింటేనే గుండె ఝల్లుమంటుంది. అదికూడా అప్పటి వరకు ఉన్న బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. ఏదో కారణంతో విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురేతే.. ఆ బాధ మాట్లలో చెప్పలేం. ఐతే ముఖ్యంగా ఆడవాళ్లు, అదికూడా పిల్లలున్న తల్లి సమాజంలో ఒంటరిగా బతకడం మరింత కష్టం అవుతుంది. దీంతో వాళ్లు దిగాలు పడిపోవడం (లేదా) ఇక జీవితమైపోయింది అనుకుని అంతం చేసుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తారు. అలా కాదు మనం జీవితం అక్కడితో అయిపోలేదంటోంది అమెరికాకు చెందిన మహిళ. మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుని నువ్వేంటో చూపేలా బతకాలంటోంది.

వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని లారెన్‌ బ్రూక్‌ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. పదేళ్ల వివాహ బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటే తట్టకోలేకపోయింది. సరిగ్గా 2012లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తానేం చేయగలను, ఏమవుతుంది జీవితం అని డీలా పడిపోయింది. ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. డైవర్స్‌ ఆగిపోతుందేమో!.. తన భర్త మళ్లీ వచ్చేస్తాడేమో అన్న ఆశ భంగపడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు ఆ  రోజు రానే వచ్చింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్‌ జంటకు విడాకులు మంజూరు చేసింది.

దీంతో ఇక ఎన్నాళ్లు ఈ బాధను మోయాలి. ఔను! ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది బ్రూక్‌. అందులో భాగంగానే తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలి అని డిసైడ్‌ అయ్యింది. ఇన్నిరోజులు ఏదో జరగుతుందన్న ఆశతో కన్నీళ్లతో గడిపాను. మంచో చెడో ఏదో ఒకటి అయ్యింది. ఇక్కడితో నా కన్నీళ్లకు స్వస్తి పలికి.. సెలబ్రేషన్‌తో ఆ విషాదానికి ముగింపు చెప్పాలనుకుంది. తన తల్లి ఫెలిసియా బౌమన్‌ (58), తన బెస్ట్‌ఫ్రెండ్‌ సమక్షంలో ఈ విషాదాన్ని వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్‌ చేశారు. మహిళలు తాను విడిపోయాను అని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడతారని  బ్రూక్‌ చెబుతోంది.

అలా కాదని ఇక నుంచి చాలా శక్తిమంతమైన మహిళగా తయారయ్యేందుకు నాంది ఇదేనని చెప్పడమే ఈ సెలబ్రేషన్‌ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్‌. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ  తెలసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశా. కామెడీగా మాత్రం కాదని చెప్పింది. "మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి" అంటూ భావోద్వేగంగా చెప్పింది.

ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్‌ చేసుకుంది. రిలేషన్‌ని కోల్పోయానన్న బాధతో ఉండకూడదు స్ట్రాంగ్‌గా ఉండి నవ్వేంటో నిరూపించుకునే తరుణం ఇది. ఇది నీకు దొరికిన అద్భుతమైన అవకాశంగా ఛాలేంజింగ్‌గా తీసుకో అని చెబుతోంది బ్రూక్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

(చదవండి: అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్‌ మనిపించకుండా ఉండలేం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top