US Midterm Elections 2022: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు

US Midterm Elections 2022: Democrats will keep control of the Senate - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఎగువ సభ సెనేట్‌పై డెమొక్రాట్లు పట్టు నిలుపుకున్నారు. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

నెవడాకు చెందిన డెమొక్రాటిక్‌ సెనేటర్‌ కేథరిన్‌ కార్టెజ్‌ మాస్తో తన రిపబ్లికన్‌ ప్రత్యర్థి ఆడం లక్సల్ట్‌పై విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన ఆడం ఓటమి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బే. అరిజోనాలోనూ డెమొక్రాటిక్‌ సెనేటర్‌ మార్కె కెల్లీ గెలిచారు. దీంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 50కి చేరింది. రిపబ్లికన్లకి 49 మంది సభ్యుల బలముంది. జార్జియాలో ఫలితం వెలువడాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top