చరిత్ర సృష్టించిన జో బైడెన్‌ | US Election 2020 Joe Biden Creates History With Highest Votes | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జో బైడెన్‌

Nov 5 2020 1:40 PM | Updated on Nov 5 2020 6:53 PM

US Election 2020 Joe Biden Creates History With Highest Votes - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు, డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. కేవలం విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌. విజయంపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికి బైడెన్‌ ఓ రికార్డు నెలకొల్పారు. అమెరికా చరి​త్రలోనే అత్యధిక ఓట్లు​ సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా అగ్ర స్థానంలో నిలిచారు. ( యూఎస్‌ ఎలక్షన్స్‌‌: గెలిచిన కరోనా మృతుడు )

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నెలకొల్పిన రికార్డును తిరగరాశారు. 2008 ఎన్నికల్లో ఒబామా 66,862,039 సాధించగా.. ప్రస్తుతం బైడెన్‌ 72,048,770 సాధించారు. అయితే ఓటింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కానీ నేపథ్యంలో ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ( అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..)

పలువురు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు, వారు సాధించిన ఓట్లు : 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement