US Travel Ban: భారత ప్రయాణికులపై ఆంక్షలు, వారికి మినహాయింపు 

US Bans Travel From Covid-Hit India. See Who Are Exempted - Sakshi

కరోనా విలయం భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు

మే 4 నుంచి ఆంక్షలు : అమెరికా

వాషింగ్టన్‌ : ఇండియాలో కరోనా ఉధృతి నేపథ్యంలో  అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.  భారత్‌ నుంచి  తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు  విధించింది. ఈ నెల (మే)  4వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా జో బైడెన్‌ ప్రభుత్వం  నిర్ణయించింది.  ఈ మేరకు వైట్ హౌస్‌ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సలహా మేరకు భారత్‌ నుంచి నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌సాకి పేర్కొన్నారు.  అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. అయితే కొన్ని వర్గాల విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, ఇతరులకు మినహాయింపునిస్తూ విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ తాజా ఆదేశాలు జారీ చేశారు.

భారత్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ (సీడీసీ) నిర్ధారించింది. బీ.1.617 వైరస్‌ వేరియంట్‌ భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ భావిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు చురుకైన చర్యలు అవసరమని సీడీసీ తేల్చినట్లు ప్రెస్‌ సెక్రెటరీ పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎవరికి మినహాయింపు 
అధ్యయనవిద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, కరోనా ప్రభావిత దేశాలలో క్లిష్టమైన మౌలిక సదుపాయాలను అందించే వ్యక్తులను ఈ నిషేధం నుంచి మినహాయించింది. బ్రెజిల్, చైనా, ఇరాన్,  దక్షిణాఫ్రికా ప్రయాణికులకు కూడా ఇదే మినహాయింపులను అమలు చేస్తోంది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం అందించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 4,01,993  కొత్త  కేసులు నమోదయ్యాయి. 3,523 మంది కరోనాతో మరణించారు. 

చదవండి: ఘోరం: 14 మంది కోవిడ్‌ బాధితులు సజీవ దహనం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top