'మీరు మారలేదు అలానే ఉన్నారు': జెలెన్‌స్కీ భార్య భావోద్వేగ పోస్ట్‌

Ukraines First Ladys Emotional Birthday Wish For Husband Zelensky - Sakshi

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 45వ ఏటలోకి అడుగుపెట్టారు. జవనరి 25 జెలెన్‌స్కీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా భావోద్వేగ పోస్ట్‌ తోపాటు జెలెన్‌స్కీ ఫోటోను కూడా పంచుకున్నారు. "మీరు నన్ను తరుచుగా ఎలా మారాను అని అడుగుతుంటారు. కానీ మీరు ఎప్పటికీ మారలేదు. నేను 17 ఏళ్ల వయసులో కలుసుకున్నప్పుడూ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు.

కాకపోతే ఇప్పుడూ చాలా అరుదుగా నవ్వుతున్నారు. మీరు మరింత బాగా నవ్వుతూ ఉండేలా పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నా అందుకు ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఐతే మీకు కాస్త మొండి పట్టదల ఎక్కువ. ప్రధానంగా ముందు మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మంచిగా నవ్వండి. ఎప్పటికీ నీకు దగ్గరగా ఉండేలా అవకాశం ఇవ్వు" అని ఒలెన భావోద్వేగంగా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

కాగా, ఈ జంట 2003లో పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరూ పిల్లలు కూడా. అందుకు సంబంధించిన పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీరిద్దరూ ప్రపంచానికే గొప్ప హిరోలు, దేశాన్ని రక్షించటం కోసం పోరాటానికి సిద్ధపడిన రియల్‌ హిరో జెలెన్‌ స్కీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వారిద్దర్నీ ప్రశంసలతో ముంచెత్తారు.

(చదవండి: లాక్‌డౌన్‌లో ఉత్తర కొరియా..కానీ కోవిడ్‌ గురించి మాత్రం కాదట!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top