రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ‘ఇంధన కాల్పుల విరమణ’ | Ukraine and Russia have agreed energy ceasefire says Donald Trump | Sakshi
Sakshi News home page

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ‘ఇంధన కాల్పుల విరమణ’

Oct 12 2026 5:38 AM | Updated on Oct 12 2026 5:38 AM

Ukraine and Russia have agreed energy ceasefire says Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి 

వాషింగ్టన్‌: వైరిపక్షాలైన రష్యా, ఉక్రెయిన్‌లు ‘ఇంధన కాల్పుల విరమణ’కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే, పూర్తి వివరాలు వెల్లడించలేదు. ట్రంప్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో ఒక పోస్టుచేశారు. ఇంధన కాల్పుల విరమణ(ఎనర్జీ సీజ్‌ఫైర్‌) ఇరు పక్షాలు అంగీకరించాయని, తక్షణమే అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. 

ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని రష్యా, ఉక్రెయిన్‌లకు సూచించారు. ట్రంప్‌ ప్రకటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన ఇంధన కాల్పుల విరమణ గురించి తాము చర్చించామని అన్నారు. ఈ కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. దీనికి రష్యా సైతం మద్దతు ఇవ్వడం ముఖ్యం అని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌ ఇంధన వ్యవస్థపై రష్యా దాడులను నిలిపివేస్తే, రష్యా రిఫైనరీలపై దాడులను ఆపడానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.

 దీనికి అంగీకరించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని ట్రంప్‌ను కోరారు. అయితే, ట్రంప్‌ చెబుతున్న ఎనర్జీ సీజ్‌ఫైర్‌పై రష్యా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావలసిన సమయం ఆసన్నమైందని, యుద్ధాన్ని ముగించడానికి జెలెన్‌స్కీ తగినంతగా కృషి చేయలేదని ట్రంప్‌ శనివారం స్పష్టంచేశారు. అమెరికాలో డీజిల్‌ ధరలు పెరగడానికి జెలెన్‌స్కీ కారణమని ఆరోపించారు. ఇంతలోనే ఉక్రెయిన్, రష్యా మధ్య ఇంధన కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందని ట్రంప్‌ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement