సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్‌ పట్టివేత | Two tons of cocaine found floating off Sicily | Sakshi
Sakshi News home page

సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్‌ పట్టివేత

Apr 18 2023 6:16 AM | Updated on Apr 18 2023 8:38 AM

Two tons of cocaine found floating off Sicily - Sakshi

రోమ్‌: ఇటలీలోని సిసిలీకి సమీపంలోని సముద్ర జలాల్లో తేలియాడుతున్న కొకైన్‌ ప్యాకెట్లివి. సుమారు రెండు టన్నుల బరువున్న 70 బండిళ్లలో 1,600 ప్యాకెట్లలోని ఈ కొకైన్‌ విలువ ఏకంగా రూ.3,700 కోట్లు!

స్మగ్లర్లు వీటిని బహుశా నౌకలో తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడ తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్లకు ట్రాకింగ్‌ డివైజ్‌ను కూడా అమర్చారని చెప్పారు. హెలికాప్టర్‌ ద్వారా పెట్రోలింగ్‌ చేస్తుండగా ఇవి కనిపించాయి.

Advertisement
 
Advertisement
Advertisement