మూగబోయిన ట్విట్టర్‌ పిట్ట.. కారణం అదేనా?

Twitter users were unable to view tweets in latest service disruption under Musk - Sakshi

న్యూయార్క్‌: ట్విట్టర్‌ మళ్లీ మొరాయించింది. గంటలపాటు స్తంభించిపోయింది. ట్విట్టర్‌ సేవలకు అంతరాయం కలగడం కొన్ని నెలలుగా పరిపాటిగా మారడం తెల్సిందే. సంస్థను మస్క్‌ హస్తగతం చేసుకున్నాక వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.

దాంతో ఉన్న కాస్త సిబ్బందికి నిర్వహణ తలకు మించిన భారంగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా 200 మంది ఇంజనీర్లను మస్క్‌ తొలగించారు. వీరిలో ప్రొడక్ట్‌ మేనేజర్లు, ఇంజనీర్లు, డేటా సైన్స్‌ విభాగ సిబ్బంది ఉన్నారు. బ్లూ వెరిఫికేషన్‌ చందా, త్వరలో అమలు చేయబోయే పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు సారథిగా ఏస్తర్‌ క్రాఫోర్డ్‌నూ సాగనంపారు. తాజా ఉద్యోగుల ఉద్వాసన పర్వంలో సేల్స్‌ విభాగ చీఫ్‌ క్రిస్‌ రేడీని మస్క్‌ వెళ్లగొట్టడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top