Turkey-Syria earthquake: భూకంప మృతులు 35,000

Turkey-Syria earthquake: Death toll goes past 35,000 - Sakshi

అదియామాన్‌: తుర్కియే, సిరియాలో వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా 35,000 మందిపైగా మరణించారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

కొందరు శిథిలాల్లో చిక్కుకొని సజీవంగా బయటపడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తుర్కియేలోని దక్షిణ హతాయ్‌ ప్రావిన్స్‌లో 13 ఏళ్ల బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. తుర్కియేలో ఉష్ణోగ్రత మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోతున్నారు. భూకంపం వల్ల తుర్కియేకు 84.1 బిలియన్‌ డాలర్లకుపైగా నష్టం వాటిల్లినట్లు టర్కిష్‌ ఎంటర్‌ప్రైజ్‌ అండ్‌ బిజినెస్‌ కాన్ఫెడరేషన్‌ అంచనా వేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top